ప్రస్తుతం కరోనా  వైరస్ సంక్షోభం నేపథ్యంలో ఎంతో మంది ప్రజలు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కనీసం కుటుంబ పోషణ కూడా చూసుకోలేక తీవ్ర మనస్థాపానికి గురై ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు కూడా ఎన్నో తెర మీదకు వస్తున్నాయి. కరోనా  వైరస్ సంక్షోభం కారణంగా ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయి ఎలాంటి ఉపాధి లేక ఆర్థికంగా చితికిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం కడుపునిండా తినడానికి తిండి కూడా లేక ఎంతో అవస్థలు పడుతున్నారు. అయితే ఇలాంటి క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రజలందరికీ అండగా ఉండేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే.



 ఇప్పటికే పలు రకాల ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించి కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అండగా ఉండేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇక ఇటీవలే రోడ్ సైడ్ బండి నడుపుకునే వారికి లేదా రహదారులపై దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వారు ఆర్థికంగా చితికిపోయినందువల్ల.. వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఇటీవల పీఎం స్వనిధి  అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న చిరు వ్యాపారులు  అందరికీ రుణం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.



 అయితే తాజాగా ఈ పథకం పై స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కరోనా  వైరస్ తో తీవ్రంగా నష్టపోయిన చిరువ్యాపారులు వీధి వ్యాపారుల అందరికీ ప్రత్యేక ప్యాకేజీ సాయం కావాలి తప్ప రుణాలు అవసరం లేదు అంటూ ప్రియాంక గాంధీ తెలిపారు. ప్రస్తుత ఉపాధిలేక ఇల్లు గడవడమే కష్టంగా మారిన చిరు వాళ్లందరికీ ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న చిన్నపాటి రుణాలు అండగా నిలవలేవు  ఆరోపించారు ప్రియాంక గాంధీ. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పీఎం స్వనిధి లబ్ధిదారులతో మాట్లాడడానికి ముందే ఈ విమర్శలు చేశారు ప్రియాంక గాంధీ.

మరింత సమాచారం తెలుసుకోండి: