తొలిసారి అధికారంలో కి వచ్చిన జగన్ రాష్ట్రన్ని ఎంతో సమర్దవంతం గా పాలన అందిస్తున్నారు..హామీ ఇచ్చిన సంక్షేమ పథకాల అమలువిషయంలో కానీ, అవినీతి ని ఎదుర్కునే విషయంలో కానీ గత సీఎం లకు విరుద్ధంగా సీఎం జగన్ పనిచేస్తుండడం ప్రజల్లో సంతోషాలు వెల్లువెత్తుతున్నాయి.. గత ఐదేళ్ల నుంచి అనుభవించిన కష్టలు జగన్ రాకతో పోయాయి అని చెప్పుకుంటున్నారు..ఇక  మూడు రాజధానుల విషయంలో ఆయన చూపిస్తున్న పట్టుదలను అమరావతిలోని ప్రతి ఒక్కరు సమర్దిస్తున్నారు.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష తో ఆయన రాజధాని తరలిస్తునారని చెప్పి ఇప్పటికే విశాఖ కు రాజధాని ని తరలించారు.. అయితే ప్రస్తుతం కోర్టు లో రాజధాని గురించి విచారణ జరుగుతుంది.. అది తేలితే తొందరలోనే విశాఖ ను రాజధాని గా చూడొచ్చన్న మాట..

మిగితా వ్యవహారాలలో కూడా జగన్ ఎంతో సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు.. ఎక్కడా ప్రతిపక్షాల విమర్శలకు తావు ఇవ్వకుండా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని మరీ అన్ని పనులు చేసుకుపోతున్నాడు.. ఓ వైపు టీడీపీ జగన్ ఏం చేసినా తప్పుబడుతుంది టీడీపీ పార్టీ.. ముఖ్యంగా చంద్రబాబు తాను చేసిన తప్పుడు పనులను జగన్ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు.. ఇక ఇటీవలే జగన్ జైలుకి వెళ్లడం ఖాయం, ఆయనపై ఉన్న అవినీతి కేసుల్లో నిజ నిర్ధారణ ఎంతో దగ్గరుంది విమర్శలు చేస్తున్నారు..

ఇక ఆయన సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తి మీద ఆరోపణలు చేశారని. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసి మరీ రచ్చ చేశారని. జగన్ పదవి క్రిస్మస్ నాటికల్లా పోతుందని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు జోస్యం చెప్పేసారు. అపుడే తాను ఏపీకి వస్తాను అంటున్నారు. ఇక విశాఖ ఆక్టోపస్ సబ్బం హరి కూడా జగన్ సీఎం గా ఎక్కువ రోజులు ఉండరని అంటున్నారు. ఇవి వైసీపీలో పెద్ద ఎత్తున అలజడిని రేకెత్తిస్తున్నాయి.ఈ కీలకమైన సమయంలో కేంద్రంలో అగ్ర స్థానంలో ఉన్న మోడీ, అమిత్ షాల మీదనే అందరి దృష్టి ఉంది. జగన్ ఒక అసాధారణమైన నిర్ణయం తీసుకున్నారు. సుప్రీం కోర్తు ప్రధాన న్యాయమూర్తి చేతిలో బంతి ఉంది. అదే సమయంలో కేంద్రంలోని ప్రభుత్వం కూడా ఇపుడు చాలా ముఖ్యమైన పాత్ర వహించాలి. కేంద్రం చొరవ తీసుకుంటేనే ఈ వివాదానికి ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుంది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: