బీహార్ లో కింగ్ మేకర్ గా వెలుగొందిన లాలూ ప్రసాద్ యాదవ్  గురించి దేశమంతా తెలిసిందే. అయితే తెలియని విషయం ఏమిటంటే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అని. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ పరిస్థితి మరియు సమయం బాగాలేదని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు బీహార్ రాజకీయాల్లో ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించిన లాలూ ప్రస్తుతమ కొన్ని కేసుల విషయంలో జైలులో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే మీడియా సమాచారం ప్రకారం అయన ఆరోగ్యం కూడా బాగా క్షీణించినట్లు తెలిసింది. శరీరంలోని అన్ని భాగాల పనితీరు సరిగా లేదని డాక్టర్స్ తెలిపినట్లు సమాచారం.

అయితే ఈరోజు విడుదలయ్యే బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని పలువురు రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కొన్ని సార్లు ఎంతటి అనారోగ్య పరిస్థితి నుండి అయినా కోలుకోవడానికి ఒక మంచి శుభవార్త కారణమవుతుందని చెబుతున్నారు. ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో కాబోయే సీఎం తేజస్వి యాదవ్ అనే వార్త బీహార్ అంతా మారుమోగిపోతోంది. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఈ ఫలితాల గురించి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉండగా లాలూ ఆరోగ్య పరిస్థితి రీత్యా ఆయనను దీపావళికి ముందుగా జైలు నుండి విడుదల చేయనున్నట్లు తెలిపారు. కానీ ఇలాంటి పరిస్థితి కనబడం లేదు. దీనితో అయన ఇంకా దిగులు పడిపోయాడు.

కొడుకు సీఎం అయి మళ్ళీ బీహార్లో వారి పార్టీ అధికారంలోకి వస్తే అయన ఆరోగ్యం కుదుటపడి మునుపటిలాగే పూర్తి ఆరోగ్యంతో ఉండాలని అయన అభిమానులు కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. మరి అంతా అనుకుంటున్నట్లు తేజస్వి యాదవ్ ఎన్డీయే కూటమిని వెనక్కు నెట్టి, బీహార్లో అధికారాన్ని చేజిక్కించుకుంటారా...లేదా వారి ముందు నిలబడలేక అధికారాన్ని వారికీ కట్టబెడతారా తెలియాల్సి ఉంది...కాగా ఇప్పటివరకు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం తేజస్వి యాదవ్ కే అనుకూలంగా రావడం సానుకూలాంశంగా చెప్పొచ్చు.     

మరింత సమాచారం తెలుసుకోండి: