జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు అని మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు చేసారు. హైద్రాబాద్ ను ఏం చేయాలనుకుంటున్నారు అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించింన కేంద్రమంత్రులే ఇప్పుడొచ్చి విమర్శలు చేస్తున్నారు అని ఆయన ఎద్దేవా చేసారు. స్మృతి ఇరానీ కూడా రాజకీయం మాట్లాడుతున్నారు అని, జవదేకర్ వచ్చి ఛార్జి షీట్ వేస్తామంటున్నారు అని, బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నారు అని ఆయన ప్రశ్నించారు. హైద్రాబాద్ ఏమన్నా బార్డర్ లో ఉందా? సర్జికల్ స్ట్రైక్ ఎక్కడ జరుగుతుంది అని నిలదీశారు.

మేం పుట్టి పెరిగిన హైద్రాబాద్ లో మీకేం పని అని నిలదీశారు. కాంగ్రెస్ ను చూస్తే బాదేస్తుంది, నవ్వొస్తోంది అని ఎద్దేవా చేసారు. ఆరోగ్య శ్రీ ని కరోనా లో ఎలా చేరుస్తారు అని ప్రశ్నించారు. బయట నవ్వుకుంటున్నట్లే కాంగ్రెస్ బ్రతుకుంది అన్నారు. మెట్రో కు, విద్యుత్ బిల్లులకు జిహెచ్ఎంసి కి ఏం సంబంధం అని నిలదీశారు. కిషన్ రెడ్డి కేంద్రం నిధులతో ఒక్క పనైనా చేపించిండా అని నిలదీశారు. 25వేలు ఇస్తామని కేంద్రం తో జీవో విడుదల చేపించండి అని ఆయన సవాల్ చేసారు. దేశంలో భాగమైన హైద్రాబాద్ లో సర్జికల్ స్ట్రైక్ చేస్తారా అని నిలదీశారు.

బండి సంజయ్ కి హైద్రాబాద్ గురించి ఏం తెలుసు అని ప్రశ్నించారు. దమ్ముంటే విరోధులు అనుకునే వారిని దేశ బహిష్కరణ చేయండి అని ఆయన సవాల్ చేసారు. కేసీఆర్ మీద మదం పట్టి మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. బండి సంజయ్ ఏం భాష మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. ఎంఐఎం వారు కూడా ప్రభుత్వాన్ని పడేస్తాం అంటున్నారు అని విమర్శించారు. అడ్డగోలుగా మాట్లాడుతున్నారు అన్నారు. ఎంఐఎం బలం ఎంత వారి ఓట్లు ఎన్ని, పరిధి ఎంత? అని ఆయన ఎద్దేవా చేసారు. మేం ఆషామాషీగా ఉన్నామా? ఎంఐఎం వాళ్ల బలం తెలుసుకుని మాట్లాడాలి అని హితవు పలికారు.

మరింత సమాచారం తెలుసుకోండి: