సుదీర్ఘకాలం పాటు ఆయుధాల విషయం లో ఇతర దేశాల పై ఆధార పడిన భారత్ ప్రస్తుతం సొంతంగా ఆయుధాలు తయారీ వ్యవస్థను క్రమ క్రమం గా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే కేవలం ఆయుధాలు  తయారు చేయడమే కాదు ఆయుధ విక్రయాల ను కూడా ప్రారంభించి ప్రస్తుతం సరికొత్త చరిత్రకు నాంది పలుకు తుంది భారత ప్రభుత్వం. ఈ క్రమంలో నే ప్రస్తుతం వివిధ దేశాలకు చెందిన ఆయుధాల తయారీ సంస్థలను ఆకర్షించి భారత్లో తమ కంపెనీలు  స్థాపించే  విధంగా భారత్ ఎంతో వ్యూహాత్మకం గా వ్యవహరిస్తోంది అన్న విషయం తెలిసిందే.



 ఆయుధ విక్రయ వ్యాపారాన్ని మరింత పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే రఫెల్  కి సంబంధించి నటువంటి సంస్థను భారత్లో తమ బ్రాంచ్ నెలకొల్పే విధంగా భారత ఆకర్షించింది.అయితే తయారీలో ఎలాంటి భారత్ ప్రమేయం ఉండదు అయినప్పటికీ కంపెనీ నిర్వహణ మాత్రం భారత్ లో  జరుగుతూ ఉంటుంది. అదే సమయంలో భారత రక్షణ పరిశోధన సంస్థ డీఆర్డీవో సరికొత్త టెక్నాలజీ తో కూడా ఆయుధాలను అభివృద్ధి చేసి ప్రస్తుతం శరవేగంగా ప్రయోగాలు నిర్వహించి  విజయవంతం అవుతున్న విషయం తెలిసిందే.



 ప్రస్తుతం ప్రభుత్వం మేకిన్ ఇండియా లో భాగంగా కీలకంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈ  క్రమంలోనే విదేశాలకు చెందిన ఆయుధ తయారీ సంస్థలు భారత్లో కి వచ్చి ఇక్కడ ఆయుధ తయారు చేయాలి అంటూ ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఈ క్రమంలోనే ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్  కార్బైన్స్  భారత్లోనే తయారుచేసేందుకు కారకల్ డిఫెన్స్ సంస్థ ముందుకు వచ్చింది. గతంలో అయితే వారి దగ్గర నుంచి భారత్ కొనుగోలు చేసింది కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారత్ ఏకంగా  ఆ సంస్థను నెలకొల్పేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇది శుభ పరిణామం అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: