ఏపీలో మంత్రి పెర్ని నానీపై జరిగిన హత్యాయత్నం సంచలనంగా మారింది. ఈ హత్య కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. సిమెంట్ పని చేసే వస్తువుతో ఒక భవన్ నిర్మాణ కార్మికుడు మంత్రిపై దాడికి దిగాడు. దీనితో పోలీసులు కూడా కృష్ణా జిల్లాలో చాలా జాగ్రత్తగా చర్యలు చేపట్టి మంత్రులు ఎమ్మెల్యేలు అందరికి పటిష్ట భద్రత ఏర్పాటు చేసారు. ఇక ఇదిలా ఉంటే ఈ  కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం కేసులో విచారణకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నిరాకరించారు.

విచారణ నిమిత్తం స్టేషన్ కు రావాంటూ రవీంద్ర ఇంటికి చేరుకున్న పోలీసులు... ఆయన విచారణకు పిలిచారు. మళ్లీ విచారణకు రావాలంటే ఎలా వస్తా అని ఆయన ప్రశ్నించారు. నేను ఒక మాజీ మంత్రిని, టీడీపీలో పొలిట్ బ్యూరో మెంబర్ గా ఉన్నత స్థానంలో ఉన్నా అన్నారు. సాధారణ వ్యక్తిలా మీరొచ్చి స్టేషన్ కు రావాలంటే ఎలా..?అని ఆయన సమాధానం ఇచ్చారు. ఘటనతో నాకు సంబంధం లేకున్నా గతంలో పోలీసులిచ్చిన సెక్షన్ 91 నోటీసులకు లిఖితపూర్వకంగా బదులిచ్చా అని ఆయన స్పష్టం చేసారు.

మళ్లీ నోటీసులివ్వండి.. నేను విచారణకు వస్తా అని ఆయన స్పష్టం చేసారు. దీంతో అప్పటికప్పుడు మరోసారి నోటీసులు అందచేసిన ఇనగుదురు సీఐ శ్రీనివాస్... విచారణకు రావాలని కోరారు. రవీంద్ర ఇంటికి చేరుకున్న మాజీ ఎంపీ, టీడీపీ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు కొనకళ్ల నారాయణరావు... విచారణకు తప్పక సహకరిస్తాం అని స్పష్టం చేసారు. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తిని స్టేషన్ కు పిలిచి విచారిస్తామనడం సరికాదు అన్నారు. ఇంటి వద్ద విచారణ చేయండి.. పూర్తిగా సహకరిస్తామని కొనకళ్ల నారాయణరావు స్పష్టం చేసారు. దీనితో పోలీసులు వెనక్కు వెళ్ళారు. గతంలో ఇచ్చిన నోటీసుల ప్రకారం వారం రోజుల్లో వివరణ ఇస్తా అని రవీంద్ర స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: