ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి కొత్త పథకాలను అములు చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే జనవరి ఒకటి నుంచి మరి కొన్ని పథకాలను అమల్లోకి తీసుకొస్తున్న విషయం విదితమే.. ఈ మేరకు 1 నుంచి ఇంటింటికీ రేషన్ సరుకులు పంపిణీ చేసే కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా సరుకులను పంపిణీ చేసేందుకు కావలసిన అన్నీ సదుపాయాలను అమర్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పథకం వాయిదా పడినట్లు తెలుస్తోంది. 



సరకుల తరలింపునకు అవసరమైన వాహనాలు జిల్లాకు రాకపోవడం.. సాంకేతిక కారణాలు అడ్డంకిగా మారాయి. ఇంటింటికి రేషన్‌ పంపిణీకి వాహనాలు సమకూర్చడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ, ఈబీసీ కార్పొరేషన్ల ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు సర్కారు శ్రీకారం చుట్టింది. వాహనాల మంజూరుకు దరఖాస్తులు ఇప్పటికే స్వీకరించి... లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేశారు. బ్యాంకు రుణం కల్పించేలా అన్నీ చర్యలను దాదాపు పూర్తి చేశారు. జిల్లాలో 1,590 సచివాలయాల పరిధిలో 1,059 వాహనాల ద్వారా నిత్యా వసరాలు జనవరి నుంచి పంపిణీ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.



వాలంటీర్లను కూడా ఎంపిక చేసుకున్నారు.జనవరిలో చౌక దుకాణాల నుంచే..: బియ్యం కార్డులకు జనవరికి రేషన్‌ విడుదల చేస్తూ పౌరసరఫరాల కమిషనర్‌ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో జిల్లాలో 19 ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి 2,659 చౌక దుకాణాలకు సరకులు చేరవేస్తున్నారు. ఈ విషయాన్ని పౌర సరఫరాల అధికారి పి.ప్రసాదరావు ఇంటింటి సరకుల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలిపారు. ఇకపోతే ప్రభుత్వ ఆదేశాల మేరకు చౌక దుకాణాలకు జనవరి సరకులు సరఫరా చేస్తున్నట్లు పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ లక్ష్మిరెడ్డి తెలిపారు... రేషన్ షాపుల నుంచే సరుకులను పొందాలని సంభందిత అధికారులు వెల్లడించారు.. ఈ పథకానికి మొదట్లోనే చుక్కెదరైంది.. దీంతో టీడీపీ నేతల విమర్శలు తారా స్థాయికి చేరాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: