దీంతో ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న ఎంతోమంది రుణ యాప్ ల పేరుతో ప్రజలను ఆకర్షిస్తున్న కేటుగాళ్ల బారిన పడి చివరికి ఆత్మహత్య లకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి. రుణ యాప్స్ నుంచి అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా.. రుణ యాప్స్ పేరుతో ప్రజలను మోసం చేసేందుకు ఏదో ఒక విధంగా కేటుగాళ్లు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
ఇక ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో రుణ యాప్స్ ఆగడాలకు మరో ప్రాణం బలి అయ్యింది. మరో కుటుంబం రోడ్డున పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇల్లంతకుంట మండలం గాలి పెళ్లి గ్రామానికి చెందిన.. పవన్ కళ్యాణ్ రెడ్డి అనే 24 ఏళ్ల యువకుడు రుణ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక చివరికి మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్లో ఉంటున్న పవన్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇక కుటుంబ సభ్యులకు తెలియకుండా రుణ యాప్ ద్వారా అప్పు చేశాడు. అప్పు చేసిన నాటి నుంచి రుణ యాప్ నిర్వాహకులు పవన్ కి ఫోన్ చేసి వేధించడంతో పాటు పవన్ ఇచ్చిన అదనపు నెంబర్లకు కూడా ఫోన్ చేసి వేధించడం మొదలు పెట్టారు. దీంతో ఇంట్లో ఈ విషయం తెలిసిపోతుంది అని భయపడిన యువకుడు మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి