ఏపీలో ఎన్నికలు జరుగుతున్న అన్ని కార్పొరేషన్ల కంటే విశాఖపట్నం - విజయవాడ - గుంటూరు కార్పొరేషన్ల‌ పైనే అందరి దృష్టి నెలకొంది. ఉక్కు ఉద్యమం జరుగుతుండటంతో విశాఖ కార్పొరేషన్ ఫలితం ఎలా ఉంటుందో ? అన్న ఆసక్తి నెలకొంది. ఇక‌ రాజధాని ప్రాంతంలో ఉన్న రెండు కార్పొరేషన్లు అయిన‌ విజయవాడ - గుంటూరు లో టిడిపికి కాస్త పట్టు ఉందని గత ఎన్నికల్లో తేలింది. ఈ రెండు లోక్‌సభ స్థానాలు వైసీపీ ఖాతాలోనే ప‌డ్డాయి. ఈ సారి మాత్రం రాజధాని వికేంద్రీకరణ జరిగిన నేప‌థ్యంలో ఇక్కడ రెండు కార్పొరేషన్ల‌ పై వైసీపీ జెండా ఎగురవేసి... తమ పార్టీపై ఎలాంటి వ్యతిరేకత లేదని ప్రూవ్ చేసుకోవాలని సీఎం జగన్ పట్టుదలతో ఉన్నారు.

ఈ క్రమంలోనే కీలకమైన గుంటూరు మేయర్ అభ్యర్థి రేసులో అధికార వైసీపీ నుంచి రెండు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మాజీ కార్పొరేటర్ కావ‌టి మనోహర్ నాయుడు తో పాటు పాదర్తి రమేష్ గాంధీ లు వైసీపీ మేయ‌ర్ రేసులో ముందు ఉన్నారు. వీరిద్దరికీ పార్టీలో బలమైన నేతల అండదండలు ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు బొత్స శిష్యుడుగా పేరున కావ‌టి మనోహర్ నాయుడు మేయ‌ర్‌ రేసులో ముందున్నా ఇప్పుడు రమేష్ గాంధీ సైతం పార్టీలో కొందరు కీలక నేతల అండదండలతో ముందు ఉండడంతో బొత్స శిష్యుడికి మేయర్ పదవి వస్తుందా రాదా ? అన్నది సందేహంగా ఉంది.

న‌గ‌రంలో తూర్పు , పశ్చిమ నియోజకవర్గాల్లో పలు డివిజన్లలో పార్టీకి రెబల్స్ బెడద ఎక్కువగా ఉండడంతో వారిని తట్టుకొని విజయం సాధించటం వైసీపీకి కష్టసాధ్యంగా మారింది. రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వీరిని బుజ్జ‌గిస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో ?  చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: