తెలంగాణాలో ఉద్యోగ సంఘాలు ఇప్పుడు రాష్ట్ర సర్కార్ ని గట్టిగా టార్గెట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయంగా సిఎం కేసీఆర్ ని ఇప్పుడు ఉద్యోగ సంఘాల ద్వారా ఇబ్బంది పెట్టే విధంగా బిజెపి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్ మీడియాతో పాటుగా పలు మాధ్యమాల్లో ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వ టార్గెట్ గా విమర్శలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక తమకు అన్యాయం జరుగుతుందని తెలంగాణా వచ్చినా సరే తమకు ఏ ఉపయోగం లేదని ఇప్పుడు ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

ఇటీవల పీ ఆర్సీ అంశంతో రాష్ట్ర ప్రభుత్వంపై మరింత వేగంగా విమర్శలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం ఉన్నా సరే తమకు అన్యాయం చేస్తుందని దీనిపై మేము ఉద్యమాలు చేస్తామని  ఉద్యోగ సంఘాలు హెచ్చరికలు చేస్తున్నాయి. ఇక తాజాగా మరోసారి ఉద్యోగ సంఘాలు కీలక వ్యాక్ఖ్యలు చేసాయి. పోరాడి సాధించుకున్న తెలంగాణలో పీఆర్సీ కోసం పోరాటం చేయాల్సిరావటం బాధాకరమన్న తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్... పీఆర్సీ కోసం రిలే నివారణ దీక్షలు చేయాలని నిర్ణయం తీసుకుంది.

మా డిమాండ్లను అంగీకరించిన వారికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేయాలని నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు. ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించింది. ఇందు కోసమేనా..  తెలంగాణ ఉద్యమం చేశారని మమల్ని చూసి ఏపీ ఉద్యోగులు నవ్వుకుంటున్నారు అని ఎద్దేవా చేసారు. రెండు సంఘాలను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం ఉద్యోగులతో ఆడుకుంటోంది అని మండిపడ్డారు. ఏపీలో పనిచేస్తోన్న తెలంగాణ ఉద్యోగులను  రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి తలుచుకుంటే ఒక్క సంతకంతో ఏపీలో పనిచేస్తోన్న తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకురావొచ్చు అని అన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయల మధ్య కొట్లాట పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని ఆరోపించారు. కాంట్రాక్టు ఉద్యోగుల శ్రమ దోపిడీ జరుగుతోంది అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: