ఇంతకీ ఆ యజమాని చేసిన పని ఏంటో తెలుసా మనుషులు ధరించే బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను ఆవులకు చేయించి ఆవుల మెడలో వేసి ఆవుల పట్ల తనకు ఉన్న ప్రేమను చాటుకున్నాడు. ఆ తరువాత ఆవులపై గులాబి పూల వర్షాన్ని కురిపించాడు.అసలు వివరాలలోకి వెళ్తే.. గుజరాత్‌కు చెందిన విజయ్ పర్సానాకు ఓ ఆవు ఉంది.ఆ ఆవును ఎప్పటినుంచో ప్రేమగా చూసుకుంటూ వస్తున్నాడు. అయితే ఆ అవుకు ఒక దూడ పుట్టింది. రెండింటిని కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటాడు విజయ్ పర్సానా. ఎంత ప్రేమంటే వాటికి ఏకంగా బంగారు, వెండి నగలు చేయించాలని భావించాడు.
అతను ఆవులకు ఆభరణాలు చేసేందుకు మంచి మంచి డిజైన్లను చూసి మరి కొన్నిటిని ఎంచుకుని, అవి నచ్చటంతో అటువంటి ఆభరణాలే చేయించాడు. ఆ తర్వాత విజయ్ తన కుటుంబ సభ్యులతో పాటు ఆవును, దూడను ఏబీ జ్యువెలర్స్ కి తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఓ గదిని పూలతో సుందరంగా డెకరేట్ చేయించారు. అప్పుడు తాను పెంచుకునే తన ఆవు, దూడలకు బంగారు ఆభరణాలు ధరింపజేశారు.తదనంతరం వాటికి స్వీట్లు, ఫ్రూట్స్ పెట్టారు. ఆ తరువాత ఆ రెండింటిపై గులాబీ పూల వర్షం కురిపించి ''ఇవి మా ఇంటి మహాలక్ష్ములు ''అంటూ తెగ మురిసిపోయాడు.మూగ జీవులపై విజయ్ చూపించిన ప్రేమ పట్ల అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.. !!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి