ఆంధ్రప్రదేశ్ అంతటా స్థానిక ఎన్నికలపైనే చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ప్రజలు బాగోగులు చూడకున్నా పర్వాలేదు, మనకు అధికారం ముఖ్యం...మనము పదవిలో ఉండడం ముఖ్యం. దానికోసం ఏమి చేయడానికైనా సిద్ధం అనే రీతిలో ప్రస్తుతం అధికార ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఎప్పటిలాగే అధికార ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న చంద్రబాబు కూడా అంతే...రాష్ట్రంలో జరిగిన ఏ విషయాన్ని వదలకుండా రాజకీయంగా వాడుకుంటున్నారు. కానీ మధ్యలో ప్రజలు మాత్రం వీరిద్దరి మధ్యన నలిగిపోతున్నారనుకోండి. ఇకపోతే నిమ్మగడ్డ రమేష్ ఎలాగైనా స్థానిక ఎన్నికలను నిర్వహించాలని పట్టు పట్టుకు కూర్చున్నారు.

అంత అపార అనుభవము మరియు తెలివితేటలు ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎందుకు ఇలా ప్రభుత్వంతో కయ్యానికి సిద్ధమవుతున్నారో అర్ధం కావడం లేదు. అయితే కొన్ని రాజకీయ వర్గాల విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇతను వ్యవహరిస్తున్న తీరు పట్ల కొన్ని ప్రధానమైన కారణాన్ని బయటపెట్టారు. అదేమిటంటే అతి సమీప కాలంలో తన పదవీకాలం ముగియనుండగా ఈ లోపే ఎలాగైనా ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక ఎన్నికలను జరిపించాలని చూస్తున్నారు. దీని వలన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు మద్దతుగా వ్యవహరిస్తున్నారని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. దీనికి అనేక ఉదాహరణలు మనము గతంలో చూసాము. అయితే ప్రభుత్వ అధికారి అయి ఉండి ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాయడం ఏమిటని అధికార పార్టీ నాయకులు  రమేష్ కుమార్ ని నిలదీస్తున్నారు, పరోక్షంగా ఎన్నో వ్యాఖ్యలు చేస్తున్నారు.  

ఎట్టకేలకు నిమ్మగడ్డ తన పంతాన్ని నెగ్గించుకునే ప్రయత్నంలో చివరి అంకానికి చేరుకున్నాడు. దీనితో ఏపీ ప్రభుత్వాన్ని మరియు అధికార పార్టీని పరోక్షంగా దెబ్బతీసినట్లయింది. అయితే జగన్ ఈ విషయంపై ఇంకా పోరాడడం విడ్డూరంగా ఉంది. ప్రస్తుతం తెలిసిన సమాచారం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇక జగనోరు సైలెంటుగా ఈ ప్రక్రియలో సహాయం చేయడం మినహా చేసేదేమీ లేదని తేలిపోయింది. ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ అయినా, ప్రభుత్వమైనా మరియు ప్రభుత్వ అధికారులయినా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలలో భాగం కావాలని రాజకీయ పెద్దలు ఇటు ప్రజలు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: