సాటి మనుషుల ప్రాణాలు విషయంలో కాస్త అయినా జాలి దయ చూపించకుండా దారుణంగా ప్రాణాలు తీసే సంఘటనలు కొన్ని అయితే.. మరికొన్ని సార్లు ఏకంగా పైశాచికంగా వ్యవహరిస్తూ క్రూర మృగాల కంటే దారుణం గా వ్యవహరిస్తున్న ఘటనలు కొన్ని తెరమీదకు వస్తున్నాయి. వెరసి రోజురోజుకు సభ్య సమాజంలో మనిషి మనుగడ ప్రశ్నార్ధకంగా భయానకంగానే మారిపోతుంది అనే చెప్పాలి. ఇప్పుడు ఎవరు ఎటు నుంచి వచ్చి దాడి చేసి హింసిస్తారు అని భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఇలాంటి ఒక అమానుష ఘటన చోటుచేసుకుంది.
మామిడితోటలో మామిడికాయలు చోరీ చేశారని చిన్నారుల పై దాడి చేసి తోట నిర్వాహకులు చేసి పైశాచిక ఆనందం పొందారు మహబూబ్ నగర్ జిల్లా తొర్రూరు మండలం చింతల పల్లి లో చోటుచేసుకుంది ఈ ఘటన. మామిడి పళ్ళు దొంగలించారు అన్న చిన్న కారణంతో ఇక చిన్నారులను చెట్టుకు కట్టేసి వాళ్ల నోట్లో పశు వ్యర్థాలను కుక్కి పైశాచికంగా వ్యవహరించారు. సోహైల్ హర్షిత్ అనే ఇద్దరు చిన్నారులను తాళ్లతో చెట్టుకు కట్టి ఆ తోట నిర్వాహకులు యజమానులు దారుణంగా హింసించారు. వారి నుంచి తప్పించుకున్న తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పడంతో ఇక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి