మొదటినుంచి పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఒంటరిగానే ముందు కదులుతుంది అయితే గతంలో టిడిపి పార్టీకి మద్దతు ఇచ్చినప్పటికీ టిడిపి పార్టీ నుంచి సరైన సహకారం అందక పోవడంతో ఇక టీడీపీకి మద్దతు ఉపసంహరించుకుంది జనసేన పార్టీ ఆ తర్వాత ఇక ఏకంగా బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమైంది అయితే బిజెపి పొత్తులో భాగంగా ఎలాంటి ఎన్నికలు జరిగినా కూడా రెండు పార్టీలు కూడా పారదర్శకంగా నిర్వహిస్తాయి అంటూ చెప్పుకొచ్చారు పవన్ . అయితే గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాజకీయాల్లో కూడా రాణించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్  అనుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే.



 అయితే అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఎన్నికల్లో కూడా బీజేపీ జనసేన కూటమి కలిసి ముందుకు కదులుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో బిజెపితో పొత్తుపై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ రాలేదు అయితే అటు రాబోయే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు అన్న వార్తలు రావడంతో ఇక తెలంగాణలో బిజెపికి పవన్ కళ్యాణ్ అవసరం లేదు అంటూ వ్యాఖ్యానించారు బీజేపీ నేతలు.అంతే కాకుండా కొన్ని విమర్శలు కూడా చేశారూ . ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో జనసేన బీజేపీ పార్టీల మధ్య పొత్తు ఉంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.



 అయితే త్వరలో ఖమ్మం నగర పాలక సంస్థలు ఎన్నికలు జరగబోతున్న  నేపథ్యంలో ఇక జనసేన బీజేపీ కలిసి ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికలు పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త 60 డివిజన్లో ఉన్న కార్పొరేషన్ల లో 54 స్థానాల్లో బీజేపీ ఆరు స్థానాల్లో జనసేన పోటీ చేయనున్నట్లు సమాచారం. అయితే రేపు నామినేషన్ల ఉపసంహరణ ఉన్న నేపథ్యంలో   ఇక తెలంగాణ లో బిజెపి జనసేన పార్టీలో కొత్త ఎంత దూరం దారితీస్తుంది అన్నది కూడా ఆసక్తికరంగా.

మరింత సమాచారం తెలుసుకోండి: