దీనికి తోడు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించిన వివరాలు భయం గొలుపుతున్నాయి. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో మాత్రమే ఐసియు బెడ్స్ అందుబాటులో ఉన్నాయని.. ఆక్సిజన్ బెడ్స్ కూడా తగ్గుతూ వస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వివరించారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బెడ్ల లభ్యత తగ్గుతుందని.. మొత్తంగా 81 కోవిడ్ కేర్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వివరించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో 27, 615 రేమిడిసివేర్ ఇంజక్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. 104 కి కాల్స్ తాకిడి బాగా పెరిగిందట.. శనివారం 13 వేల కాల్స్ ఉంటే ఆది వారం 17వేలకు పైగా కాల్స్ వచ్చాయట. అలాగే 2589 మంది హాస్పిటల్ అడ్మిషన్ కోసం 104 కి కాల్ చేశారట. హోమ్ ఐసోలేషన్ పేషంట్స్ కి కూడా మేము కాల్ చేస్తున్నామని.. 92,702 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వివరించారు.
గత ఏడాది 18 వేల మంది తాత్కాలిక ఉద్యోగులను తీసుకున్నామని.. ఈ ఏడాది 16018 మందికి ఇప్పటికే అపాయింట్మెంట్ ఇచ్చామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆక్సిజన్ డిమాండ్ అధిగమించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని.. ఆక్సిజన్ పరికరాలు కొనుగోలుకు పెద్దఎత్తున డిమాండ్ పెరిగిందని ఆయన తెలిపారు. ఆక్సిజన్ పరికరాలు కొనుగోలు కోసం ఏపీ ప్రభుత్వం ప్రోక్యుర్మెంట్ కమిటీ ఏర్పాటు చేసింది. సాధారణ విధానంలో వెళితే కొనుగోలుకు సమయం పడుతుందని కమిటీ ఏర్పాటు చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి