
దీంతో సైఫాబాద్ పోలీసులు జీరో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి పంజాగుట్ట పిఎస్ కు బదిలీ చేశారు అని ఆయన వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని నాలుగు బృందాలుగా విడిపోయి పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేపట్టారు అన్నారు. శ్రవణ్ గేహ్లాట్ అనే బంగారు నగల వ్యాపారి వద్ద పనిచేసే గులాబ్ మాలి & ముకేష్ పరిహార ఈ బంగారు ఆభరణాల బ్యాగు చోరీ చేశారు అని శ్రవణ్ గెహ్లాత్ అనే నగల వ్యాపారి ఆగస్ట్ 23న పుణెలో వున్న గులాబ్ మాలి కీ బ్యాగు అప్పగించాడు అని ఆయన తెలిపారు.
నగల బ్యాగు ను ముంబాయి లో వున్న ముకేష్ పరిహార కి అందజేయమని వీరంతా నగరానికి చేరుకున్నారు అన్నారు. కానీ అంతలోనే శ్రవణ్ గేహ్లాట్ వద్ద పనిచేసే గులాబ్ మాలి & ముకేష్ పరిహార బ్యాగుతో ఇద్దరు నిందితులు పారిపోయారని అన్నారు. ఇద్దరు నిందితుల నుండి దాదాపు కోటి రూపాయల విలువ చేసే 2122.130 గ్రాముల బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పంజాగుట్ట పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి నగరంలోని పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పరిశీలించి అనంతరం ముంబయి లో కూడా సీసీ కెమెరాలు పరిశీలించారు అని అన్నారు. గదిచిన కొద్ది రోజులుగా కొనసాగుతున్న విచారణలో నగల వ్యాపారి తో ప్రయాణం చేసిన తోటి సిబ్బంది ఇద్దరు ఈ బ్యాగు చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు అని ఆయన తెలిపారు.