దేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం రోడ్ల అభివృద్ధి మీద దృష్టి పెట్టింది. దేశ వ్యాప్తంగా రహదారులపై విమర్శలు రావడంతో వాటిని తిప్పి కొడుతూ కష్టపడుతుంది కేంద్రం. మన తెలుగు రాష్ట్రాల్లో సైతం రోడ్ల నిర్మాణం మీద బలంగా దృష్టి పెట్టి జాతీయ రహదారులను నిర్మించే కార్యక్రమాలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. భారత మాల ప్రాజెక్ కింద మన తెలుగు రాష్ట్రాల్లో రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. కృష్ణా జిల్లా విజయవాడ, హనుమాన్ జంక్షన్ వద్ద పలు ఫ్లై ఓవర్లను కూడా నిర్మించారు. తాజాగా ప్రకాశం జిల్లాలో అద్భుతమైన రోడ్డు నిర్మాణం చేపట్టింది కేంద్రం.

దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ప్రకాశం జిల్లాలో అత్యవసరంగా విమానాలు దిగేలా రోడ్లు నిర్మించడం అభినందనీయం అని కొనియాడారు.  దేశ భద్రత , ప్రకృతి వైపరీత్యాల వల్ల తలెత్తే అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవడం,  రహదారులపై సైతం విమానాలు దిగేలా నిర్మాణాలను చేపట్టడం అంటూ ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.  కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికీ ,  ప్రధాని నరేంద్ర మోదీ కి అభినందనలు చెప్పారు. జాతీయ మాల పథకంలో భాగంగా రాజస్థాన్ లోని జాతీయ రహదారిపై బాడ్మేర్ వద్ద నిర్మించిన ఎయిర్ స్ట్రిప్ తలమానికంగా నిలుస్తోంది అన్నారు.

ఈ విశిష్ట పథకాన్ని ఆంధ్రప్రదేశ్ లో కూడా అమలు చేస్తున్నందుకు తెలుగు ప్రజల తరఫున కృతజ్ఞతలు చెప్పారు పవర్ స్టార్. జాతీయ రహదారుల అభివృద్ధిలో గణనీయంగా కృషి చేస్తున్న  కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, గవాయుసేన పక్షాన ఈ నిర్మాణాలను పర్యవేక్షిస్తున్న  కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్  ప్రశంసనీయులు అని పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఈ పథకం ద్వారా మన దేశంలో రోడ్లను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు అన్నారు.  మీ నిబద్ధత మన దేశానికి , ప్రజలకు సత్పలితాలను అందిస్తుందని విశ్వసిస్తున్నాను అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: