ఏపీలో రాజ‌కీయం ఎంత వేడిగా ఉందో చూస్తూనే ఉన్నాం. వైసీపీ వాళ్లు ఏకంగా మంగ‌ళ‌గిరి లోని టీడీపీ ప్ర‌ధాన కార్యాల‌యంపై ఎటాక్ చేశారు. ఒకే సారి ప‌క్కా ప్లానింగ్ తో ఏపీ లో ప‌లువురు నేత‌ల ఇళ్ల తో పాటు జిల్లాల్లో ఉన్న టీడీపీ కార్యాల‌యాల‌పై సైతం దాడులు చేశారు. పార్టీ అధినేత చంద్ర‌బాబు సైతం ఈ దాడులు చూసి తీవ్రంగా క‌ల‌త చెందారు. పార్టీ నేత‌లు ఈ రోజు రోడ్ల మీద‌కు వ‌చ్చి నిర‌స‌న‌లు, ధ‌ర్నాలు , ఆందోళ‌న లు చేశారు. పార్టీ సీనియ‌ర్లు సైతం రోడ్డెక్కారు. కానీ ఇలాంటి ప‌రిస్థితుల్లో కొంద‌రు సీనియ‌ర్లు మాత్రం నోరు మెద‌ప క పోవ‌డం ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. సీనియ‌ర్ నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు వైఖ‌రి పై ఇప్పుడు సొంత పార్టీ వ‌ర్గాల్లోనే తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

య‌న‌మ‌ల కే కాదు. ఆయ‌న కుటుంబానికి కూడా ప్ర‌జ‌ల్లో ఎప్పుడో ప‌ట్టు పోయింది. ఇంకా చెప్పాలంటే 2004 నుంచి కూడా య‌న‌మ‌ల ఫ్యామిలీ కి జ‌నాల్లో ఆద‌ర‌ణ లేకుండా పోయింది. 2009 , 2014, 2019 ఎన్నిక‌ల లో ఆయ‌న తో పాటు ఆయ‌న సోద‌రుడు కృష్ణుడు ఇద్ద‌రూ కూడా చిత్తు చిత్తు గా ఓడిపోతూ వ‌స్తున్నారు. పైగా ఈ మూడు ఎన్నిక‌ల్లో య‌న‌మ‌ల ఫ్యామిలీ క‌నీస పోటీ ఇవ్వ‌లేదు స‌రిక‌దా ?  ఘోరంగా ఓడిపోయింది. పార్టీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు తునిలో య‌న‌మ‌ల ఫ్యామిలీ ఓడినా కూడా య‌న‌మ‌ల ను ఎమ్మెల్సీని చేసిన చంద్ర‌బాబు ఆయ‌న‌కు ఏకంగా ఆర్థిక మంత్రి ప‌ద‌వి ఇచ్చారు.

ఇక గ‌త ఎన్నిక‌ల‌లో తునిలో య‌న‌మ‌ల ఫ్యామిలీకి సీటు ఇవ్వ‌వ‌ద్ద‌ని అక్క‌డ కేడ‌ర్ మొత్తుకున్నా కూడా మ‌రోసారి ఆయ‌న చెప్పినట్టు ఆయ‌న సోద‌రుడికే సీటు ఇచ్చారు. ఇక మైదుకూరులో య‌న‌మ‌ల వియ్యంకుడు పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ కు సీటు ఇవ్వ‌వ‌ద్ద‌ని అక్క‌డ నేత‌లు నెత్తి నోరు కొట్టుకున్నా కూడా బాబు య‌న‌మ‌ల ఒత్తిడికి త‌లొగ్గి సీటు ఇచ్చారు. పైగా సుధాక‌ర్ యాద‌వ్ ను టీటీడీ చైర్మ‌న్‌ను కూడా చేశారు. అలాంటిది ఇప్పుడు పార్టీ క‌ష్ట‌కాలంలో ఉంటే య‌న‌మ‌ల బ‌య‌ట‌కు రావ‌డం లేదు. ఏదో తూతూ మంత్రంగా ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తూ కాలం గ‌డుపుతున్నారు. మ‌ళ్లీ పార్టీ అధికారంలోకి వ‌స్తే మ‌ళ్లీ ప‌ద‌వులు ద‌క్కించుకోవ‌డం మిన‌హా య‌న‌మ‌ల వ‌ల్ల పార్టీకి కించిత్ ఉప‌యోగం కూడా లేద‌నే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: