హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం అన్ని పార్టీలు కూడా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఓటర్ మహాశయులకు ఆకట్టుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నాయి అన్ని పార్టీలు. అయితే ఉప ఎన్నికల్లో ప్రధాన పోటీ టీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉంది అన్న విషయం తెలిసిందే. అధికార టీఆర్ఎస్ పార్టీ ఎట్టిపరిస్థితుల్లో గెలవాలని భావిస్తోంది. అదే సమయంలో అటు బీజేపీ అభ్యర్థి  ఈటల రాజేందర్ గెలిచి తన సత్తా చాటాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక బీజేపీ ఢిల్లీ పెద్దలను కూడా రంగంలోకి దింపి ప్రచారం నిర్వహించాలని భావించింది. ఇప్పటికే తెలంగాణ బీజేపీ కీలక నేతలు అందరూ కూడా రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు.



 ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్రసంగాలు ఇస్తూనే ఉన్నారు. ఇక అటు ఢిల్లీ పెద్దలు కూడా వచ్చి ప్రచారం నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్న సమయంలో బిజెపికి ఊహించని షాక్ తగిలింది. హుజరాబాద్ లో ప్రచారానికి బిజెపి జాతీయ నేతలు కేంద్ర మంత్రులు దూరం కానున్నట్లు తెలుస్తోంది. బహిరంగ సభను నిర్వహించేందుకు ఈసి నిబంధనలు అడ్డువస్తున్నాయి. దీంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభ క్యాన్సల్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కేవలం రాష్ట్ర నేతలు స్టార్ క్యాంపెయినర్స్  ప్రచారంతో మాత్రమే బీజేపీ సర్దుకునే అవకాశం ఉంది



 అయితే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను టిఆర్ఎస్ నేతలు పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఈ క్రమంలోనే జాతీయ నేతలతో సభలు నిర్వహించి టీఆర్ఎస్ విమర్శలను తిప్పి కొట్టాలని భావించింది బిజెపి. ముందుగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో హుజరాబాద్ లో బహిరంగ సభ నిర్వహించాలి అని అనుకుంది . కానీ బిజెపికి ఊహించని షాక్ తగిలింది. దీంతో రాష్ట్ర నేతలు భుజాలపైన పూర్తి బాధ్యత పడింది. ఇప్పటికే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రఘునందన్ రావు, డీకే అరుణ, జితేందర్ రెడ్డి లాంటి ముఖ్య నేతలందరూ ఢిల్లీలోనే మకాం వేశారు. నేటి నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం హుజరాబాద్ ప్రచారంలో పాల్గొననున్నారు.  కోర్టు కేసుల కారణంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కేవలం హైదరాబాద్కే పరిమితం కావలసి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: