ఇటీవలే టిడిపి నేత పట్టాబి సీఎం జగన్ మోహన్ రెడ్డి ని ఉద్దేశిస్తూ బూతులు మాట్లాడటం.. అటు వెంటనే వైసీపీ శ్రేణులు అందరూ ఆగ్రహంతో ఏకంగా టిడిపి కార్యాలయం పైన దాడి చేసి ధ్వంసం చేయడం సంచలనంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలతో ఏపీ రాజకీయాల్లో మరో సారి వేడి రాజుకుంది  అయితే టిడిపి కార్యాలయం పై దాడిని నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నలభై ఎనిమిది గంటల నిరసన చేపడుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ నేతలు కూడా వైసీపీ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తాజాగా ఇదే విషయంపై స్పందించిన మాజీమంత్రి టీడీపీ సీనియర్ నేత పరిటాల సునీత జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇన్ని రోజుల వరకు వరకు ఎంతో ఓపికగా ఉన్నాము. ఇక ఓపికగా ఉండలేని పరిస్థితి ఏర్పడింది అంటూ పరిటాల సునీత వ్యాఖ్యానించారు. గ్రామాల్లో వైసిపి ఎన్నో ఇబ్బందులు సృష్టిస్తుంది అంటూ వ్యాఖ్యానించారు. పార్టీ ఆఫీస్ పక్కనే డిజిపి కార్యాలయం ఉంది అయినప్పటికీ టిడిపి కార్యాలయం పై దాడి జరిగినా ఎవరూ పట్టించుకోలేదు అంటూ వ్యాఖ్యానించారు. గతంలో మేం కూడా పోలీసు విభాగాన్ని వాడుకొని ఉంటే వైసిపి గుండాలు ఒక్కరు కూడా మిగిలే వాళ్ళు కాదు అంటూ వ్యాఖ్యానించారు పరిటాల సునీత. పరిటాల రవి ని పొట్టనబెట్టుకున్నా కూడా.. అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతిగా ఉండమని చంద్రబాబు చెప్పారు. అందుకే ఎక్కడ గొడవకు వెళ్ళలేదు అంటూ వ్యాఖ్యానించారు. ఆ రోజు చంద్రబాబు కన్నెర్ర చేసి ఉంటే ఒక్కరు కూడా మిగిలి ఉండేవారు కాదు అంటూ పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిటాల రవి ని చంపిన వారు రోడ్ల మీద తిరుగుతూ ఉంటే చంద్రబాబు మీద గౌరవంతో ఆయన చెప్పిన మాటకు కట్టుబడి ఎలాంటి గొడవలకు పోలేదు అంటూ వ్యాఖ్యానించారు. ఇక పరిస్థితి చేయి దాటి పోయింది. మాకు మారిన చంద్రబాబు కావాలి అంటూ వ్యాఖ్యానించారు. మా పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గంట కళ్ళు మూసుకుంటే చాలు మేము ఏంటో చూపిస్తాము.. మాది కూడా సీమ రక్తమే ఇక ఇదంతా జరుగుతుండటం చూస్తూ ఉంటే రక్తం మరుగుతోంది. మంత్రులు ఇష్టానుసారంగా  మాట్లాడుతున్నారూ.. బూతులు మాకు కూడా వచ్చు.. త్వరలో మేము ఏం చేస్తామో చూపిస్తాం అంటూ పరిటాల సునీత వైసీపీ పై తీవ్రస్థాయిలో విమర్శలతో విరుచుకుపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: