ఎస్ ఇప్పుడు అంద‌రూ షాక్ అవుతున్నారు. పార్టీ పెట్టి ఏడేళ్లు దాటుతున్నా ఎప్పుడూ ప‌వ‌న్ ఫుల్ టైం పొలిటిషీయ‌న్ అన్న మాట అనిపించు కోలేదు. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల‌కు ముందు సినిమాలు మానేస్తాన‌ని చెప్పారు. అయితే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన చిత్తుగా ఓడిపోవ‌డ‌తో ఆయ‌న మ‌ళ్లీ సినిమాల్లోకి వ‌చ్చి ఎంచ‌క్కా ఫుల్ టైం సినిమా హీరో అయిపోయారు. ఏడేళ్లు అవుతున్నా ఇప్ప‌ట‌కీ జ‌న‌సేన‌కు క‌మిటీ లు లేవు. అలాంటి ప‌వ‌న్ ఇప్పుడు సీరియ‌స్ గా పార్టీ నిర్మాణంపై కాన్ సంట్రేష‌న్ చేస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది.

ప‌వ‌న్ ఇప్పుడు స‌రికొత్త రాజ‌కీయ నేత‌గా ఆవిర్భ వించ బోతున్నారు. జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌లు చేయ‌డంతో స్టార్ట్ చేసి మండ‌ల స్థాయి క‌మిటీలు కూడా వేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. అస‌లు ఆ పార్టీ పెట్టిన ఏడేళ్ల‌కు క‌మిటీలు లేవు. ఎలాంటి క‌మిటీ లు లేకుంగానే గ‌త ఎన్నిక‌ల‌కు ఆ పార్టీ వెళ్లింది. అయితే ఇప్పుడు మాత్రం జిల్లా క‌మిటీ ల‌తో పాటు మండ‌ల క‌మిటీల‌ను కూడా పూర్తి చేసేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

వ‌చ్చే నెల 15 నాటికి మండ‌ల పార్టీ అధ్య‌క్షులు, మండ‌ల క‌మిటీల నియామ‌కం ప్ర‌క్రియ పూర్తి చేయాల‌ని ప‌వ‌న్ ఆదేశాలు జారీ చేయ‌డంతో పాటు ఈ బాధ్య‌త అంతా నాదెండ్ల మ‌నోహ‌ర్‌కు అప్ప‌గించేశారు. ఆ త‌ర్వాత ఆయ‌న జిల్లా ప‌ర్య‌ట‌న‌ల‌కు రెడీ అవుతార‌ట‌. మ‌రో వైపు ఆయ‌న వ‌రుస‌గా సినిమాలు ఒప్పు కుంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌లు మ‌రో రెండేళ్లు మాత్ర‌మే ఉన్నాయి.

ఇటీవ‌ల స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఊహించ‌ని విధంగా పుంజు కోవ‌డంతో పాటు భారీ సంఖ్య‌లో లోక‌ల్ సీట్లు గెలుచు కుంది. ఇది కూడా ప‌వ‌న్ లో కొత్త ఆశ‌లు చిగురించ డానికి కార‌ణ‌మైంద‌ని అంటున్నారు. ఇలాంటి టైంలో ఆయ‌న రాజ‌కీయంగా పార్టీని క్షేత్ర స్థాయి నుంచే బ‌లోపేతం చేసేందుకు యాక్ష‌న్ ప్లాన్ స్టార్ట్ చేయ‌డం తో ఆయ‌న సీరియ‌స్ రాజ‌కీయాలు స్టార్ట్ చేశాడ‌నే చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: