వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల పాదయాత్ర తెలంగాణ‌లో కొన‌సాగుతోంది. ష‌ర్మిల పాద‌యాత్ర తెలంగాణ లో 90 నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌వ‌ర్ అయ్యేలా రూట్ మ్యాప్ వేశారు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గం లోనూ మూడు మండ‌లాల్లో పాద‌యాత్ర ఉండేలా ప్లాన్ చేశారు. ప్ర‌జ‌ల్లో ఓ మోస్త‌రు ఆద‌ర‌ణ అయితే ష‌ర్మిల‌కు వ‌స్తుంది అన్న‌ది అయితే నిజం. అయితే ఇప్పుడు వ‌రుస పెట్టి వైసీపీ నేత‌లు ష‌ర్మిల‌ను క‌లుస్తుండ‌డం అటు తెలంగాణ రాజ‌కీయాల్లోనే కాకుండా.. ఇటు వైసీపీ వ‌ర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.

ఆదివారం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి షర్మిలను కలిసి ఏవేవో మాట్లాడేసి వెళ్లారు. అస‌లు సుబ్బారెడ్డి ఎందుకు వ‌చ్చారు ? ఎందుకు ష‌ర్మిల‌ను క‌లిశారు ? అన్న‌ది అంతు ప‌ట్ట‌డం లేదు. కొంద‌రు మాత్రం జ‌గ‌న్ కు చెప్పి.. జ‌గ‌న్ అనుమ‌తి తోనే ఆయ‌న ఇక్క‌డ‌కు వ‌చ్చార‌ని అంటున్నారు. ఇక సోమవారం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏకంగా ష‌ర్మిల పాదయాత్రలో పాల్గొని క‌ల‌క‌లం రేపారు. పైగా  వీరిద్దరూ ఏపీ సీఎం జగన్ తో పాటు షర్మిలకు అత్యంత సన్నిహితులు అన్న‌ది తెలిసిందే.

రెండు రోజుల వ్య‌వ‌ధిలో వైసీపీకి చెందిన ఇద్ద‌రు కీల‌క నేత‌లు షర్మిలతో భేటీ కావడం అటు ఏపీలో ఇటు తెలంగాణలో రాజ‌కీయ కాక రేపుతోంది. ఈ నేత‌లు మామూలుగా వ‌స్తున్నారా ?  లేదా ? అన్న , చెల్లి మ‌ధ్య రాయ‌భారాలు న‌డుపుతున్నారా ? అన్న‌ది అంతు ప‌ట్ట‌డం లేదు. మ‌రో టాక్ ప్ర‌కారం ష‌ర్మిల ఏపీలో కూడా పార్టీ పెడుతుంద‌న్న సందేహాలు ఉన్నాయి. అందుకే ఆమె ను బ‌తిమి లాడే క్ర‌మంలోనే ఆమె తో స‌న్నిహితంగా ఉన్న వైసీపీ నేత‌లు అంద‌రూ ఇక్క‌డ‌కు వ‌చ్చి ఆమెను క‌లుస్తున్నార‌ని అంటున్నారు. మ‌రి ష‌ర్మిల వ‌ర్సెస్ జ‌గ‌న్ రాజ‌కీయం ఎలా ఉంటుందో ? అన్న‌ది మాత్రం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల్లో పెద్ద ఉత్కంఠ మైన అంశం గా మారింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: