సాధారణంగా ఎన్నికల ఫలితాలు పార్టీ మీద, ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడి మీద ప్రభావం చూపుతాయి. ఇది ఎవరు అవునన్నా..ఎవరు కాదన్నా ... అంగీకరించాల్సిన నిజం. కాక పోతే పార్టీ నిర్ణయాలు తక్షణం ఉండక పోవచ్చు. కానీ కాలక్రమంలో ఎన్నికల ఫలితాలు మాత్రం ప్రభావం చూపిస్తాయి. అందుకనే ముందు జాగ్రత్త చర్యగా పార్టీ ల అధ్యక్షులు నైతిక బాధ్యత వహిస్తూ పార్టీకి రాజీనామా లేఖ పంపించామంటూ పాత్రికేయుల ముందు పేర్కోంటుంటారు. ప్రాంతీయ పార్టీలకు ఆ బెడద అంతగా ఉండక పోవచ్చు కానీ, జాతీయ పార్టీలుగు చెప్పుకునే కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు మాత్రం ఈ ఇబ్బందులుంటాయి.
బద్వేల్ ఉప ఎన్నిక ఫలితాల అనంతరం బిజేపి అధ్యక్షుడు మారుతారు అని ఆ పార్టీ శ్రేణులు అంతర్గాతంగా చర్చించుకుంటున్నాయి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టాక ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న రెండో ఉపఎన్నిక ఇది. తిరుపతి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న బల్లి దుర్గా ప్రసాద్ రావు మరణంతో అక్కడ ఉప ఎనిక జరిగింది. సాధారణంగా మరణించి వ్యక్తి కుటుంబ సభ్యులకు ఆ స్థానం కేటాయించడం తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న అనవాయితి. కొన్ని సందర్భాలలో ఈ ఆనవాయితీ తప్పి ఉండవచ్చు కూడా. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో అధికా పార్టీ తరపున దుర్గా ప్రసాద్ కుటుంబ సభ్యులు పోటీ చేస్తారని అందరూ భావించారు. కాని దుర్గా ప్రసాద్ తనయడు కొంత వెనక్కి తగ్గడంతో అతనిని శాసన మండలికి పంపిస్తామని చెప్పింది అధికార వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాలక్రమంలో ఆ మాట నిలబెట్టుకుంది కూడా. అది వేరే విషయం.
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో అధికార వై.ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గురుమూర్తి బరిలో దిగారు. తెలుగు దేశం పార్టీ నుంచి మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి బరిలో దిగారు. ఆ ఎన్నికల్లో జనసేన అభ్యర్థి బరిలో ఉంటారని అందరూ భావించారు. కానీ ఆ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీ బరిలో దిగింది. ఆ ఎన్నికల్లో బి.జెపికి డిపాజిట్లు గల్లంతయ్యాయి. అంతలోనే బద్వేల్ శాసన సభకు ఉప ఎన్నిక. ఇక్కడ కూడా గతంలో మాదిరిగానే జనసేన పోటీ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ జనసేన పక్కకు తప్పుకుని బిజేపిని ఎన్నికల ముందుకు నెట్టింది. అసలే అంతంత మాత్రం ఆర్థిక వనరులతో కొట్టు మిట్టాడుతున్న పార్టీ శ్రేణులకు ఇది శరాఘాతమైంది. దీనికితోడుఎన్నికల ప్రచారంలో తానే స్టార్ క్యాంపెయినర్ గా సోము వీర్రాజు వ్యవహరిస్తున్నారు. జనసేన నుంచి పెద్దగా సహాయ సహకారాలు అందలేదు. దీంతో బిజెపి కి గెలిపు ఆశ సన్నగిల్లింది.
గతంలో బిజెపి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా ఉన్న కన్నా లక్ష్మీ నారాయణ ను హఠాత్తుగా తప్పించి ఆ స్థానంలో వీర్రాజుకు పదవి కట్టబెట్టారు. ఎందుకు కన్నాను పక్కన పెట్టారు? ఎందుకు వీర్రాజు పట్టం కట్టారు అనే విషయంలో ఎవరూ సరై సమాధానం చెప్పలేదు. ఈ దఫా ఆ పార్టీకి పడె ఓట్లను అనుసరించి సోమువీర్రాజును పదవిలో కొనసాగించే పరిస్థితి నెలకోంటుందని బి.జె.పి శ్రేణులు పేర్కోంటున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి