కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దౌత్య పరంగా భారత్ ఎంత వ్యూహాత్మకంగా ముందుకు కదులుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు భారత్ వెనుకబడిన దేశం అంటూ చులకనగా చూసిన దేశాలు.. ఇక ఇప్పుడు భారత దౌత్య పరంగా ఎంతో బలమైన సంబంధాలు కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఇప్పుడు ప్రతి విషయంలో అగ్రరాజ్యాలతో పోటీపడుతుంది భారత్. ఈ సమయంలోనే అగ్రరాజ్యాలతో ఎంతో మెరుగైన సంబంధాలను ఏర్పరచు కుంటూ ఉంది. ముఖ్యంగా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అగ్రరాజ్యమైన అమెరికా తో భారత్ సంబంధం రోజురోజుకు మరింత బలంగా మారిపోతుంది.


ఈ క్రమంలోనే ఇప్పటికే భారత్ అమెరికాల మధ్య ఎన్నో రకాల ఒప్పందాలు కూడా కుదిరాయన్న విషయం తెలిసిందే. అయితే డోనాల్డ్ ట్రంప్  ఉన్న సమయంలో భారత్ అమెరికా మధ్య ఎంతో బలమైన బంధం ఏర్పడింది. తర్వాత అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్  విజయం సాధించిన తర్వాత భారత్-అమెరికా సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి అన్న దానిపై మాత్రం అందరిలోనూ అనుమానాలు నెలకొన్నాయి. ఇక అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ సైతం భారత్తో సంబంధాలు కొనసాగించేందుకు ఎంతో ఆసక్తి కనబరుస్తూ ఉండటం గమనార్హం.


 ఈ క్రమం లోనే ఇటీవల అమెరికా చైనా కు షాక్ ఇస్తున్న భారత్ కి గుడ్ న్యూస్ చెప్పింది. ప్రజాస్వామ్య పరిరక్షణ పై డిసెంబర్ 9, 10వ తేదీలలో అమెరికా లో వర్చువల్ భేటీ జరగబోతోంది. ఇక ఈ సమావేశం లో పలు దేశాలకు అగ్రరాజ్యమైన అమెరికా ఆహ్వానం పంపడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇటీవలే అమెరికా అధ్యక్షుడు బైడెన్ భారత్తో పాటు 109 ఇతర దేశాలకు స్వయంగా ఆహ్వానించారు. ఈ క్రమంలోనే అటు చైనా కు మాత్రం ఆహ్వానం పంపక పోవడం గమనార్హం. చైనా రష్యా టర్కీ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక దేశాల కు ఆహ్వానం పంపలేదు అమెరికా.

మరింత సమాచారం తెలుసుకోండి: