తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ప్రతి పార్టీలో రోజుకో మలుపు తిరుగుతున్నాయి అని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్, బిజెపి పార్టీల్లో ఉన్నటువంటి నాయకుల మధ్య సఖ్యత సరిగ్గా కుదరక వివాదాలు కొనసాగుతున్నాయి. అయితే  ఇన్ని రోజుల నుంచి వివాదాలకు దూరంగా ఉన్న బిజెపి పార్టీలో కూడా సమస్యలు మొదలయ్యాయి. తెరాస పార్టీ నుంచి బిజెపిలో చేరి హుజురాబాద్ ఎన్నికల్లో విజయం సాధించిన ఈటల రాజేందర్ కు మరియు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కి మధ్య వివాదం కొనసాగుతోందని తెలుస్తోంది. ఒకరి మాట  ఒకరు వినకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఈ వివాదాలకు కారణం ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక లేనా..?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి పార్టీ తటస్థంగా ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అంటున్నారు. కానీ ఆయన మాటలను బేఖాతరు చేస్తున్నటువంటి ఈటల రాజేందర్ తనకు  నచ్చిన విధంగా వ్యవహరిస్తూ పోతున్నారు. అది ఏంటో తెలుసుకుందామా..? ఇటీవలే తెరాసలో తనకు అనుకున్న విధంగా న్యాయం జరగక పోవడంతో సీనియర్ నేత మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ తెరాస పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. అయితే రవీందర్ సింగ్ కు బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సపోర్టు అందిస్తామని  తెలియజేస్తున్నారు. కానీ బండి సంజయ్ మాత్రం బిజెపి ఎవరికి సపోర్ట్ చేయడం లేదని తటస్థంగా  ఉంటుందని తెలుపుతున్నారు. ఇలా ఇద్దరు బీజేపీ నేతల మధ్య  సఖ్యత కుదరకపోవడంతో అధికార టీఆర్ఎస్ పార్టీకి మంచి ఛాన్స్ దొరుకుతుంది  అని చెప్పవచ్చు. పార్టీ అధ్యక్షులు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కరీంనగర్లోని కొంతమంది బిజెపి  కార్పొరేటర్లు ఈటల రాజేందర్ తో కలిసి సర్దార్ రవీందర్ సింగ్ కు మద్దతు ఇవ్వడం అనేది బండి సంజయ్ కి నచ్చడం లేదు. దీంతో ఆయన తీవ్రంగా మండిపడుతున్నారు. మరి ఈటెల అధ్యక్షుడి నిర్ణయానికి వ్యతిరేకంగా ఎందుకు ముందుకు పోతున్నారు.. ఆయన వ్యూహం ఏంటని. పలువురు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: