ఏపీలో చాలా నియోజకవర్గాల్లో ఏ పార్టీ లీడ్‌లో ఉందో చాలా క్లారిటీ ఉందని చెప్పొచ్చు. మెజారిటీ నియోజకవర్గాల్లో వైసీపీ లీడ్‌లో ఉండగా, కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ లీడ్‌లోకి వచ్చింది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ కొన్ని నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ నడుస్తోంది. అసలు ఎవరు లీడ్‌లో ఉన్నారో చెప్పలేని పరిస్తితి ఉంది. విజయవాడ తూర్పు స్థానంలో కూడా లీడ్ విషయంలో క్లారిటీ రావడం లేదు.

ఇక్కడ గత రెండు పర్యాయాలు నుంచి టీడీపీ జెండా ఎగురుతూ ఉంది. గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. టీడీపీ అధికారంలో ఉండగా ప్రజల్లోనే ఉన్నారు...లేకపోయినా ప్రజల్లోనే ఉన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడు కృషి చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా బాగానే పనిచేస్తున్నారు...ఎక్కడా కూడా నెగిటివ్ తెచ్చుకోలేదు. అలాగే ఈయనకు నియోజకవర్గంలో మంచి ఫాలోయింగ్ ఉంది...పార్టీలకు అతీతంగా సాయం చేస్తారనే పేరుంది. అందుకే తూర్పులో గద్దె బలం తగ్గడం లేదు.

గద్దె పొజిషన్ అలా ఉంటే.. ఇటు వైసీపీ తరుపున ఇంచార్జ్‌గా పనిచేస్తున్న దేవినేని అవినాష్ కూడా మంచిగా పనిచేస్తున్నారు. పైగా అధికార పార్టీలో ఉండటంతో ప్రజలకు కావాల్సిన పనులు చేసి పెడుతున్నారు..సమస్య ఉందని తన దగ్గరకొచ్చే ప్రతి ఒక్కరీ సమస్యని ఆయన పరిష్కరిస్తున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు...వ్యక్తిగతంగా కూడా ప్రజలకు సాయం చేస్తున్నారు....సొంత డబ్బులు ఖర్చు పెడుతూ ప్రజలకు అండగా ఉంటున్నారు.  దేవినేని అవినాష్ కూడా తూర్పులో మంచి ఫాలోయింగ్ ఉంది.  

అంటే గద్దె గానీ, అవినాష్ గానీ ఇద్దరు మంచి లీడర్లే. ప్రజల కోసం పనిచేసే నాయకులే. ఫాలోయింగ్ ఉన్న నాయకులే. అందుకే తూర్పులో లీడ్ ఎవరి వైపు ఉందో క్లారిటీ రావడం లేదు. ఒకరు పై సాధించారు...ఒకరు కిందకు వెళ్లిపోయారని చెప్పడానికి లేదు. అసలు తూర్పులో పోటాపోటి వాతావరణం ఉంది. మరి వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఉండే పరిస్తితి బట్టి....తూర్పులో ఇద్దరిలో ఒకరు పైచేయి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
   

మరింత సమాచారం తెలుసుకోండి: