జనాలపై చంద్రబాబునాయుడుకి బాగా మంటగా ఉంది. బారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లోని జనాలు జగన్మోహన్ రెడ్డితో ఆప్యాయంగా మాట్లాడటాన్ని, ముద్దులు పెట్టడాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోయారు. బాధితులను పరామర్శించేందుకు జగన్ వెళ్ళినపుడు జనాలంతా ముఖ్యమంత్రిపై రెచ్చిపోతారని, మండిపోయి దుమ్మెత్తిపోస్తారని, శాపనార్ధాలు పెడతారని పాపం చంద్రబాబు అండ్ కో తో పాటు ఆయనకు మద్దతుగా నిలిచే మీడియా ఊహించింది.

అయితే అలాంటిదేమీ జరగకపోగా ఊహించినదానికి రివర్సులో జరగటాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోయారు. అందుకనే ప్రజలకు బుద్ధిలేదు, జ్ఞానం లేదంటు మండిపోయారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటించినపుడు జనాలు ఆప్యాయంగా పలకరించటం ఏమిటంటు రెచ్చిపోయారు. ముఖ్యమంత్రి బాధితులను పరామర్శించేందుకు వెళినపుడు ఒక ముసలావిడ సీఎంతో నవ్వుతు మాట్లాడటమేంటి అంటు ఆశ్చర్యపోయారు. ప్రపంచంలో ఎక్కడన్నా ఇలాగ జరుగుతుందా ? 62 మంది చనిపోయారన్న బాధ జనాల్లో ఉందా అంటు రెచ్చిపోయారు.

గడ్డం పట్టుకుని జగన్ను  ముద్దు పెట్టుకుంటారా ? సీఎంను పట్టుకుని పొగుడుతారా ? వీళ్ళసలు ఏం మనుషులు ? సభ్యత, సంస్కారం లేనివాళ్ళే ఇలాగ ప్రవర్తిస్తారు ? అంటు పదే పదే బాధితులను పట్టుకుని చంద్రబాబు వ్యాఖ్యలు చేయటమే ఆశ్చర్యంగా ఉంది. జనాలు సీఎంతో హ్యాపీగా మాట్లాడుతారో ? లేకపోతో మండిపోయి శాపనార్ధాలు పెడతారో జనాలిష్టం. ఇందులో చంద్రబాబుకు వచ్చిన బాధేమిటో అర్ధం కావటంలేదు.

పరామర్శించేందుకు వచ్చిన జగన్ పై జనాలంతా నానా తిట్లు తిట్టి, శాపనార్ధాలు పెడతారని చంద్రబాబు అనుకున్నట్లున్నారు. కానీ దానికి విరుద్ధంగా జరగటాన్ని తట్టుకోలేకపోయారు. అందుకనే జనాలను పట్టుకుని నోటికొచ్చినట్లు మాట్లాడేశారు. ఇక్కడ చంద్రబాబు అయినా ఆయనకు మద్దతిచ్చే మీడియా అయినా మరచిపోయిన విషయం ఒకటుంది. జగన్ అంటే చంద్రబాబుకు, ఆయన మీడియాకు మంటున్నంత మాత్రాన జనాలకు ఉండాల్సిన అవసరం లేదు. జగన్ మీద జనాలకు మండినపుడు మాత్రమే తిరగబడతారు.

కడపునొప్పి ఉన్నవాడే మందు వేసుకోవాలనే చిన్న లాజిక్ ను చంద్రబాబు+ఆయన మీడియా మరచిపోయింది. జగన్ కు వ్యతిరేకంగా జనాలను రెచ్చగొట్టాలని ఎంత ప్రయత్నించినా ఎలాంటి ఉపయోగం ఉండదని వీళ్ళు మరచిపోయారు. ఇదే సమయంలో జనాలకు నిజంగానే జగన్ పై మండినపుడు చంద్రబాబు+మీడియా ప్రమేయం లేకుండానే జనాలు మంటలు మండిస్తారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు కూడా ఇలాంటి లాజిక్కులు మరచిపోయి జనాలను నోటికొచ్చినట్లు మాట్లాడితే తానే నష్టపోతానని తెలుసుకోవటంలేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: