జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మంచి పనిచేసింది. మంత్ర బాలినేని శ్రీనివాసరెడ్డి మద్దతుదారుడు సుబ్బారావు గుప్తాపై దాడి చేసిన మరో మద్దతుదారుడు సుభానీని పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి కొడాలినాని, ఎంఎల్ఏలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ చేస్తున్న వ్యాఖ్యల వల్ల పార్టీకి చెడ్డపేరొస్తోందని చెప్పారు. దాంతో మండిపోయిన కొందరు చోటానేతలు సుభానీ నేతృత్వంలో సదరు బుబ్బారావు వెంటపడ్డారు. వెంటపడటమే కాకుండా సుబ్బారావును గదిలో వేసి కొట్టడాన్ని వీడియో తీయించుకుని వైరల్ కూడా చేశారు.

ఇక్కడే ప్రభుత్వానికి బాగా చెడ్డపేరొచ్చింది. నిజానికి జరిగిన ఘటనకు జగన్ కు వ్యక్తిగతంగా ఎలాంటి సంబంధం లేదన్నది వాస్తవం. కానీ జరిగిన ఘటన వెలుగుచూసిన కారణంగా వచ్చిన నెగిటివిటీని భరించాల్సింది మాత్రం జగన్ ప్రభుత్వమే. ఒక వ్యక్తి అత్యుత్సాహంతోనో లేకపోతే స్వామిభక్తిని ప్రదర్శించేందుకో చేసిన పని ఇపుడు పార్టీ+ప్రభుత్వానికి చుట్టుకున్నది. మంత్రి కొడాలి, ఎంఎల్ఏలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీల వల్ల పార్టీకి మైనస్ అవుతోందనేది సుబ్బారావు భావన.

నిజానికి వంశీ టీడీపీ ఎంఎల్ఏ అన్న విషయం అందరికీ తెలుసు. కాకపోతే చంద్రబాబునాయుడుతో పడని కారణంగా టీడీపీకి దూరమైపోయి వైసీపీకి దగ్గరయ్యారు. కొడాలి నాని మాటలు ఎప్పుడూ ఇలాగే ఉంటాయి. ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా చంద్రబాబు అండ్ కో పై కొడాలి ఇలాగే మాట్లాడేవారు. ఇక అంబటి చాలా జాగ్రత్తగానే మాట్లాడుతారు. సెటైర్లు బాగా పేలుస్తారు కానీ దూషించటం మాత్రం దాదాపు ఉండదు. కాబట్టి వీళ్ళముగ్గురి విషయంలో సుబ్బారావు చేసిన ఫిర్యాదు పూర్తిగా నిజంకాదు. సుబ్బారావు వ్యాఖ్యలు నిజమైనా కాకపోయినా దాడిచేయటం మాత్రం నూరుశాతం తప్పే.

తాజా పరిణామాల్లో మళ్ళీ సుబ్బారావును కేక్ కటింగ్ కు పిలవటం, కేకును తినిపించినా చేసిన తప్పు ఎక్కడికీ పోదు. కాబట్టి అర్జంటుగా దాడిచేసి కొట్టిన సుభానీ అనే నేతను పార్టీ నుండి బయటకు పంపటంతో పాటు కేసు కూడా పెట్టాలనే డిమాండ్లు మొదలయ్యాయి. లేకపోతే ఏమవుతుందంటే రేపు ఇంకెవరైనా వ్యతిరేక వ్యాఖ్యలు చేశారనగానే వెంటనే దాడిచేసి కొట్టేస్తారనో ఆందోళన మొదలైంది. దాంతో విషయం జగన్ దాకా వెళ్ళిందట. దాంతో సుభానీపై కేసు నమోదు చేయటమే కాకుండా అరెస్టు కూడా చేశారు. పార్టీకి జరిగిన డ్యామేజీని కొంతవరకైనా కంట్రోల్ చేయగలిగారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: