అయితే అటు ప్రభుత్వాలు కూడా మాస్కు ధరించని వారి విషయంలో కాస్త కఠినంగా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం. హెల్మెట్ పెట్టకపోయినా వందల్లో ఫైన్ వేస్తున్నారు కానీ మాస్కు ధరించకపోతే మాత్రం ఏకంగా వెయ్యి రూపాయల పైన్ కట్టాల్సిందే. ప్రతి ఒక్కరు కూడా ముఖానికి మాస్కు లేకుండా కాలు బయట పెట్టడం లేదు. అయితే కొంత మంది మాత్రం కాస్త అతి తెలివిని ప్రదర్శిస్తూ ఉండటం గమనార్హం. ఒకవైపు కరోనా వైరస్ మహమ్మారి పెరిగిపోతున్న తరుణంలో ముఖానికి పెట్టుకునే వాహనం నెంబర్ ప్లేట్ కు పెట్టి జరిమానాలను తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇక ఇలా బండి నెంబర్ ప్లేట్ కు మాస్కు పెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం భాగ్యనగరంలో ఎంతోమంది యువకులు ఇలా బైక్ నెంబర్ ప్లేట్ మాస్క్ తో మూసేసి పోలీసుల కెమెరాలకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు అని అర్థమవుతుంది. ఇటీవల జీడిమెట్ల పరిధిలోని చింతల్లో ఇలాంటి తరహా ఒక వాహనం పోలీసుల కెమెరాకు చిక్కింది.. నెంబర్ ప్లేట్ కు మాస్కు పెట్టి యువకులు త్రిబుల్ రైడింగ్ లో వెళ్తున్నారు. అయితే ఇది చూసి పోలీస్ అధికారి సైతం షాక్ అయ్యాడు. తన కెమెరాతో క్లిక్ మనిపించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి