2021 వెళ్లిపోగా 2022 వచ్చేసింది. పాత సంవత్సరం మిగిల్చిన చెడు జ్ఞాపకాలు అన్నీ కొట్టుకు పోయి 2022 కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని అంతా కోరుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే న్యూ ఇయర్ అంటే మందు బాబుల సందడి ఎలా ఉంటుంది అన్న దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా నిన్న రాత్రి నుండే న్యూ ఇయర్ ని ఫుల్ గా ఎంజాయ్ చేసిన మందన్నలు బార్లు వద్ద బారులు తీరి చిందులు వేశారు. అంతేనా నిన్న ఒక్క రోజే మందు తాగే విషయంలోనూ రికార్డ్ సృష్టించారు. ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా లిక్కర్ సేల్స్ లో సంచలనం సృష్టించారు.

దేశంలో  డిసెంబర్ 31 ఒక్కరోజే రూ.171.93 కోట్ల లిక్కర్‌ సేల్ అయినట్లు చెబుతున్నారు. డిసెంబర్ నెల మొత్తం కూడా లిక్కర్ సేల్స్ భారీగా జరిగాయట. ఆ లెక్కన చూసుకుంటే డిసెంబర్ 30 నుండి ఈ రోజు వరకు ఖచ్చితంగా 200 కోట్ల వరకు అమ్మకాలు జరుగుతాయని తెలుస్తోంది. కానీ మందు బాబులు ఏమి అర్ధం చేసుకున్నారో తెలియనట్టుంది. ఏదో మంది అమ్మకాలకు ఈ రోజే చివరి తేదీ లాగా లిక్కర్ కొనడం మన మైండ్ ను దిమ్మతిరిగేలా చేస్తోంది. అయితే వీరేదో దేశాన్ని అభివృద్ధి చేయడానికే తాము త్యాగం చేస్తున్నట్లు అనుకొని ఇన్స్పైర్ అయినట్లు తెలుస్తోంది.

ముందు మనం మన ఆరోగ్యం బాగుంటేనే దేశం బాగుంటుంది. అయితే గత ఏడాది 2021 డిసెంబర్ నెలలో లిక్కర్ సేల్స్ కంటే ఈ ఏడాది డిసెంబర్ నెలలో లిక్కర్ సేల్స్ గణనీయంగా పెరిగాయి. 2020 డిసెంబర్ లో మద్యం అమ్మకాలు రూ.2,764 కోట్ల 78 లక్షలుగా కాగా ఈ 2021 డిసెంబర్ నెలలో లిక్కర్ సేల్స్  రూ.3,459 కోట్ల  వరకు జరిగిందట. మొత్తానికి మందు బాబులు దినదినాభివృద్ధి చెందుతున్నారు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: