ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు, త్రిష, మంచు లక్ష్మి, వరలక్ష్మి, రాజేంద్ర ప్రసాద్ వంటి వారు వరుసగా కరోనా భారిన పడగా.. తాజాగా నటి రేణు దేశాయ్ మరియు ఆమె తనయుడు అఖీరా సైతం కరోనా భారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా రేణూ దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. కాగా వారి ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్నారు అభిమానులు. వారి ఆరోగ్యం ఎలా ఉంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అయితే ప్రస్తుతం వారి ఆరోగ్యం మెరుగ్గానే ఉన్నట్లు సమాచారం. అఖీరా, రేణు దేశాయ్ ఇరువురు కూడా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంటున్నారు.
రెండు మూడు రోజుల్లో వారి ఆరోగ్యంపై ఒక పాజిటివ్ వార్త వస్తుందని భావిస్తున్నారు. వారు కోలుకుంటున్నారు అని ప్రస్తుతం లక్షణాలు కూడా బాగా తగ్గాయని త్వరలోనే రికవరీ అవుతారని వారి డాక్టర్లు తెలిపారట. కాబట్టి ఫ్యాన్స్ ఆందోళన చెందకండి. ఇక రేణు దేశాయ్, అఖీరా ఇద్దరు కూడా చాలా జాగ్రత్తగా ఇంట్లోనే ఉంటున్నప్పటికీ వారికి కరోనా సోకిందని కాబట్టి కరోనా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని రేణు దేశాయ్ అన్నారు. రేణు ఇప్పటికే రెండు డోస్ ల కరోనా వ్యాక్సిన్ ను వేయించుకోగా అఖీరా ఇంకా వేయించుకోలేదు. ఇదే కారణంగా తెలుస్తోంది అఖీరా నుండి రేణు దేశాయ్ కో సోకినట్లుగా వార్తలు వస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి