ప్రపంచంలో మానవాళిని నాశనం చేసే వైరస్ ఇంకా బయటపడలేదు. కరోనా ప్రాణాలు తీస్తున్నా.. దాన్ని తట్టుకునే యాంటీబాడీలను మానవ శరీరం ఉత్పత్తి చేస్తుందని, టీకాతో ప్రయోజనం ఉందనే విషయం కూడా అనుభవంలేకి వచ్చింది. కానీ ఇటీవల నియోకోవ్ అనే వైరస్ గురించి ప్రపంచానికి తెలిసింది. చైనాలోని వుహాన్ శాస్త్రవేత్తలు దీన్ని అత్యంత ప్రమాదకర వైరస్ గా చిత్రీకరిస్తున్నారు. దీని ప్రభావానికి లోనయితే కనీసం ప్రతి ముగ్గురిలో ఒకరికి మరణం ఖాయం అనే వార్తలు కూడా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. కానీ వాటిపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.

అసలేంటీ నియో కొవ్ అని ఇతర దేశాల శాస్త్రవేత్తలు కూడా దీనిపై ఆరాలు తీస్తున్నారు. నియో కోవ్ ప్రస్తుతానికి జంతువుల్లో మాత్రమే వ్యాపిస్తోందని మాత్రం ఉమ్మడి అభిప్రాయానికి వచ్చారు. జంతువులనుంచి అది మానవులకు సోకే ముప్పు తక్కువగా ఉంటుందని మాత్రం తేల్చి చెబుతున్నారు. అయితే ఇది మానవులకు సోకితే దాని ప్రభావం ఎలా ఉంటుందనేదానిపై కూడా పరిశోధనలు సాగుతున్నాయి.

యాంటీబాడీలతో పని జరగదు..
సహజంగా ఏదైనా వైరస్ మానవ శరీరంపై దాడి చేస్తే.. సహజంగా దానికి యాంటీబాడీలను మన రోగనిరోధక వ్యవస్థ తయారు చేస్తుంది. అయితే ఈ నియో కొవ్ వైరస్ కి మాత్రం యాంటీబాడీలను తట్టుకునే శక్తి ఉందట. యాంటీబాడీలేవీ నియో కొవ్ పై పనిచేయడంలేదని మాత్రం తేలిపోయింది. అంటే ఇది ఎంత ప్రమాదకరమైనదో అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతానికి ఇది కేవలం జంతువుల్లో మాత్రమే వ్యాప్తి చెందడం కాస్త ఊరటనిచ్చే అంశం. అది మానవుల్లోకి ప్రవేశిస్తే మాత్రం మరింత ప్రమాదకరం అని అంటున్నారు. ప్రస్తుతానికి మానవులకు వచ్చే ముప్పేమీ లేకపోయినా, యాంటీ బాడీలకు మాత్రం  నియో కోవ్ తలొగ్గదని తేలడంతో భయాందోళనలు నెలకొంటున్నాయి. కానీ దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. నిపుణులు మాత్రం నియోకోవ్ తో ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేదని తేల్చి చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: