ఢిల్లీః  కాసేపటి క్రితమే.. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.  ఈ బడ్జెట్ సమావేశాలపై పలు కీలక అంశాలు తీవ్ర ప్రభావం చూపనున్నాయి.   మరొకసారి చర్చకు “పెగసస్” వ్యవహారం  రానుంది.  ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సమాయత్తమైయ్యాయి ప్రతి పక్షాలు. 2017 లో ఇజ్రాయేల్ తో భారతదేశం చేసుకున్న రక్షణ ఒప్పందాల్లో భాగంగా “పెగసస్” స్పైవేర్ సాఫ్ట్ వేర్ ను కూడా కొనుగోలు చేసినట్లు “న్యూయార్క్ టైమ్స్” వార్తా కథనం వచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానంగా రైతుల వెతలు, చైనా దాడులు, కవ్వింపు చర్యలు,  “కోవిడ్” బాధితులకు నష్టపరిహారం చెల్లింపులు,  ప్రభుత్వరంగ సంస్థ అయున “ఎయుర్ ఇండియా” ను “టాటా” సంస్థ కు అమ్మకం లాంటి అంశాలపై నే పార్లమెంట్‌ చర్చించనుంది. ఈ నేపథ్యంలోనే.. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించారు టి.ఆర్.ఎస్ ఎమ్.పిలు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించారు టి.ఆర్.ఎస్ పార్లమెంట్‌ సభ్యులు. 

ఇక అటు  కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు  మంత్రి కేటీఆర్.  గడిచిన ఎడున్నరేళ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ, సహకారాలు లేవని.. కనీసం ఈసారి కేంద్ర బడ్జెట్ లో ఆయినా రాష్ట్ర విభజన హామీలు అమలు చేయాలన్నారు మంత్రి కేటీఆర్‌.  తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలి...తెలంగాణ, ఆంద్రప్రదేశ్ కు స్పెషల్ ఇండస్ట్రియల్ రాయితీలు అందించాలన్నారు మంత్రి కేటీఆర్.   తెలంగాణ కాకతీయ, మెగా టెక్స్ట్ పార్క్, ఫార్మా సిటీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇప్పటికి రాలేదు...ప్రధానమంత్రి మోదీ పదే పదే సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటున్నారు....రాష్ట్రాలకు నిధులు విధుల్చకపోతే ఎలా సాధ్యమవుతుందని చెప్పారు మంత్రి కేటీఆర్.   భారతదేశంలో నాలుగు పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి కేంద్రం సహరిస్తే వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి...రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర సహకారం అవసరమన్నారు మంత్రి కేటీఆర్.  


మరింత సమాచారం తెలుసుకోండి:

trs