
ఓడిపోయాక శ్రీరామ్ రాప్తాడులోనే పనిచేసుకుంటూ వచ్చారు..ఈ క్రమంలోనే ధర్మవరంలో టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన గోనుగుంట్ల సూర్యనారాయణ బీజేపీలోకి వెళ్ళిపోయారు..దీంతో బాబు, ధర్మవరం బాధ్యతలు శ్రీరామ్‌కు అప్పగించారు. అలా రాప్తాడు, ధర్మవరం బాధ్యతలు పరిటాల ఫ్యామిలీ చూసుకుంటుంది. ఇక ఇటీవల ధర్మవరం సీటు కోసం గోనుగుంట్ల ట్రై చేయడం మొదలుపెట్టారు..ఆయన మళ్ళీ టీడీపీలోకి వచ్చి ధర్మవరం సీటు దక్కించుకోవాలని చూశారు.
ఎవరు పార్టీలోకి వచ్చిన కూడా ధర్మవరం సీటు మాత్రం తనదే అని శ్రీరామ్ చెప్పుకొచ్చారు..సీటు దక్కకపోతే రాజకీయాలని వదిలేస్తానని కూడా చెప్పారు..అయితే అనూహ్యంగా తాజాగా చంద్రబాబు...ధర్మవరం సీటు శ్రీరామ్‌కు ఫిక్స్ చేశారు. అంటే ఇప్పుడు రాప్తాడులో సునీతమ్మ, ధర్మవరంలో శ్రీరామ్ పోటీ చేయడం ఖాయమైంది. రాప్తాడు విషయం పక్కన పెడితే ధర్మవరంలో వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి చెక్ పెట్టడం అనేది అంత సులువైన పని కాదు...బలమైన ఫాలోయింగ్ ఉన్న ఆయనని ఓడించడం ఈజీ కాదు.
శ్రీరామ్ మరింత బలం పెంచుకుంటేనే..కేతిరెడ్డికి చెక్ పెట్టగలరు..ప్రస్తుతం ఉన్న బలంతో కేతిరెడ్డికి చెక్ పెట్టడం సులువు కాదనే చెప్పాలి...కాబట్టి శ్రీరామ్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి..అదే సమయంలో నెక్స్ట్ గాని పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే పరిటాలకు కాస్త ప్లస్ అవుతుంది. గత ఎన్నికల్లో ధర్మవరంలో జనసేనకు 6 వేల ఓట్ల వరకు పడ్డాయి..కాబట్టి ఎంతోకొంత పరిటాల శ్రీరామ్‌కు పవన్ ప్లస్ అవుతారని చెప్పొచ్చు.