తానొకటి తలిస్తే దైవం ఇంకోటి తలచాడనే సామెత చంద్రబాబునాయుడుకు సరిగ్గా సరిపోతుందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే ఇలాంటి అనుమానాలే పెరుగుతున్నాయి. రెండు నియోజకవర్గాల్లో తమ్ముళ్ళు చంద్రబాబు నిర్ణయాలతో విబేధిస్తున్నారట. ఇంతకీ విషయం ఏమింటటే తన సహజస్వభావానికి భిన్నంగా చంద్రబాబు అభ్యర్ధులను ప్రకటిస్తున్నారు. ఇలా ప్రకటించిన అభ్యర్ధుల విషయంలో మిగిలిన తమ్ముళ్ళు మండిపోతున్నారట.

మామూలుగా చంద్రబాబు నైజం ఏమిటంటే నామినేషన్లకు 48 గంటలో లేదా 24 గంటల ముందు మాత్రమే అభ్యర్ధులను ప్రకటిస్తారు. చివరినిముషంలో అభ్యర్ధిత్వాలు ఖారరై నామినేషన్లు వేయటానికి నానా అవస్తలు పడిన నేతలున్నారు టీడీపీలో. ఇలాంటి వైఖరికి స్వస్తిపలికి సరికొత్తగా అభ్యర్ధులన ముందే ప్రకటిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని డోన్ అంతకుముందు చిత్తూరు జిల్లాలోని పుంగనూరుకు అభ్యర్ధులను ప్రకటించేశారు. ఇంకా ఎన్ని నియోజకవర్గాల్లో ఇలా అభ్యర్ధులను ప్రకటించబోతున్నారో తెలీదు. 

పుంగనూరులో ప్రకటించిన చల్లాబాబు విషయంలో స్ధానిక నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారట. మాజీమంత్రి అమరనాధరెడ్డి కూడా చల్లాబాబు ఏమాత్రం సరిపోడని చెప్పారట. అవసరమైతే తాను పోటీచేస్తానని కూడా చంద్రబాబుతో చెప్పారని సమాచారం. ఎందుకంటే ఒకపుడు అమర్ పుంగనూరు నుండి చాలాసార్లు పోటీచేసి గెలిచారు. అంటే చల్లాబాబు ఏరకంగా చూసినా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎదుర్కోలేరని పార్టీలోనే చెప్పుకుంటున్నారు.


ఇక డోన్ నియోజకవర్గంది మరోకత. ఇక్కడేమిటంటే ధర్మవరం సుబ్బారెడ్డిని అభ్యర్ధిగా చంద్రబాబు ప్రకటించారు. 1989 నుండి ఈ నియోజకవర్గంలో కేఈ కుటుంబమే పోటీచేస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఇక్కడినుండి పోటీచేసిన కేఈ ప్రభాకర్ ఓడిపోయారు. తాను యాక్టివ్ గా ఉన్నప్పటికీ తనను కాదని చంద్రబాబు ఏకపక్షంగా సుబ్బారెడ్డిని ప్రకటించటంతో కేఈ కుటుంబానికి మండిపోతోందట. అభ్యర్ధిని కూడా ప్రకటించేసిన తర్వాత ఇపుడు చేయగలిగేదేమీ లేదని అందుకనే పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో కేఈ కుటుంబం ఉన్నట్లు సమాచారం. మరీ పరిస్ధితుల్లో చంద్రబాబు ఏమి చేస్తారన్నది ఆసక్తిగా మారింది. సుబ్బారెడ్డినే కంటిన్యు చేస్తారా ? కేఈ కుటుంబాన్ని వదులుకుంటారా చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: