అతిచేస్తె గతిచెడుతుందనే సామెత తెలుగులో చాల పాపులర్. రాజస్ధాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వ్యవహారమే సామెతకు  తాజా ఉదాహరణ. అశోక్ కు ప్రత్యామ్నాయంగా అధిష్టానం వేరే పేర్లను పరిశీలిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పోటీచేయాలని అనుకున్నారు. అధిష్టానం సోనియాగాంధి, రాహుల్ గాంధీ ఆశీస్సులు కూడా ఉన్నాయి. పోటీలో ఎంతమందున్నా గెహ్లాట్ ఎన్నిక లాంఛనమనే ప్రచారం అందరికీ తెలిసిందే. బహుశా ఈ విషయంలోనే గెహ్లాగ్ చాలా ఓవర్ యాక్షన్ మొదలుపెట్టినట్లున్నారు.






తాను తప్ప అధిష్టానానికి వేరే దిక్కులేదని అనుకున్నట్లున్నారు. అందుకనే అధ్యక్ష బాధ్యతలతో పాటు సీఎంగా కూడా కంటిన్యు అవుతానని పట్టుబట్టారు. నానా గోలైన తర్వాత చివరకు మెత్తబడి ముఖ్యమంత్రి పదవిని వదిలిపెట్టడానికి ఒప్పుకున్నారు. అయితే ఇక్కడకూడా ఒక మెలికపెట్టారు. అదేమిటంటే తన తర్వాత సీఎంను అధిష్టానం కాకుండా తానే ఎంపికచేస్తానని. తాను ఎంపికచేసిన వ్యక్తినే అధిష్టానం ఆమోదించాలని షరతుపెట్టారు.






సీఎల్పీ మీటింగ్ పెట్టుకుని ఎంఎల్ఏల అభిప్రాయాలు తీసుకునేందుకు అధిష్టానం దూతలుగా వచ్చిన ఇద్దరు సీనియర్లను అసలు లెక్కేచేయలేదు. సీఎల్పీ సమావేశానికి ప్యారలల్ గా మరో సమావేశం జరిగింది. గెహ్లాట్ చెప్పినట్లు అధిష్టానం వినకపోతే రాజీనామాలకు సిద్ధమంటు ఎంఎల్ఏలు చేసిన హెచ్చరికతో సోనియా+సీనియర్ల ఖంగుతిన్నారు. ఎంఎల్ఏలిచ్చిన వార్నింగ్ అంతా వెనుకనుండి  గెహ్లాట్ ఆడించిన నాటకమే అని అర్ధమైపోయింది. ఇపుడు గనుక గెహ్లాట్ ను అడ్డుకోకపోతే ముందు ముందు పార్టీకి చాలా ఇబ్బందులు తప్పవని సీనియర్లంతా సోనియాను గట్టిగా హెచ్చరించారు. అధ్యక్షుడు కాకుండానే ఇంత ఓవరాక్షన్ చేస్తుంటే ఇక అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత గెహ్లాట్ వైఖరి ఎలాగుంటుందో అని సోనియా, సీనియర్లు ఆలోచించారు.




సీనియర్ల హెచ్చరికలను ఆలోచించిన సోనియా చివరకు గెహ్లాట్ కు ప్రత్యామ్నాయాన్ని ఆలోచిస్తున్నారట. నామినేషన్ వేయటమే ఆలస్యం అధ్యక్షుడు అయిపోయినట్లే అనుకున్న గెహ్లాట్ చివరకు కాళ్ళబేరానికి వచ్చారట. తప్పయిపోయింది క్షమించమని సోనియా, మల్లికార్జునఖర్గే, అజయ్ మాకెన్ లను బతిమలాడుకుంటున్నారట. సోనియా గట్టిగా నిలబడి అధ్యక్ష అభ్యర్ధిగా ఇంకోరిని చూసుకుంటే ? సీఎంగా సచిన్ పైలెట్ ను ఎంపిక చేస్తే అప్పుడు గెహ్లాట్ పరిస్ధితి ఏమిటి ? ఇందుకే పెద్దలు చెప్పేది అతిచేస్తే గతిచెడుతుందని.

మరింత సమాచారం తెలుసుకోండి: