ఏపీలో రాజకీయ పరిస్థితులు మరియు సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈసారి జరగబోయే ఎన్నికల్లో అధికార పార్టీకి షాక్ ఇవ్వడానికి ఒకవైపు ప్రజలు మరో వైపు పవన్ సమరశంఖారావం పూరించనున్నారు. రెండు రోజుల క్రితం విశాఖ లో జరిగిన సంఘటన పై రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం తనదైన రీతిలో ప్రెస్ మీట్ పెట్టి ఎప్పటిలాగే సినిమా డైలాగులతో హోరెత్తించాడు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత పవన్ విశాఖ నుండి ప్రత్యేక విమానంలో విజయవాడ నోవాటెల్ హోటల్ కు చేరుకున్నారు.

ఇక్కడకు చంద్రబాబు వచ్చి పవన్ ను కలిసి విశాఖ సంఘటనపై చర్చించారు. ఇలా టీడీపీ మరియు జనసేన అధ్యక్షులు ఒకేచోట కలవడంతో రాజకీయంలో డీప్ డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి. అదేంటి... మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ టీడీపీ తో పొత్తు ఉండదన్నట్లుగా మాట్లాడి ఇప్పుడిలా చంద్రబాబు ను కలిశాడు అని ఎవరికి తోచినట్లు మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ మీటింగ్ లో పవన్ కానీ లేదా చంద్రబాబు కానీ పరస్పర పొత్తు గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోయినా, బీజేపీ తో పొత్తు గురించి మాట్లాడడంతో హాట్ టాపిక్ అయింది. పవన్ మాట్లాడుతూ బీజేపీ తో పొత్తులో ఉన్న ఎందుకో వారితో కలిసి వెళ్లలేకపోతున్నామంటూ నిరాశను వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీపై నాకు పూర్తి గౌరవం ఉందని, అంతమాత్రాన వారితో కలిసి నడుస్తాము అన్న భరోసాను ఇవ్వలేనని ఖరాఖండీగా చెప్పేశాడు.

ఇలా బీజేపీ తో ఇష్టం లేదని చెప్పాడు కాబట్టి టీడీపీ తో పొత్తుకు సై అన్నట్లుగా అంత ఫిక్స్ అయ్యిపోయారు. అయితే ఇక్కడే జనసేనాని మరోసారి తప్పు చేస్తున్నాడా అంటూ కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలాగే టీడీపీతో కలిసి వెళ్లినా పవన్ కు పెద్దగా ఒరిగిందేమీ లేదు.. కానీ టీడీపీ అధికారంలోకి రావడానికి మాత్రం బాగా ఉపయాగపడింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైసీపీ కి మరియు టీడీపీ కి ప్రజల్లో సమన వ్యతిరేకత ఉంది. కానీ ఇదే సమయంలో జనసేన పై మంచి అభిప్రాయమే ఉంది.. ఈ పొత్తు పెట్టుకుని మళ్ళీ ఆ అభిప్రాయాన్ని కోల్పోయేలా ఉన్నాడు పవన్ కళ్యాణ్.. ఈ విషయాన్ని జనసైనికులు గమనించాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: