ఎంత సినీ సెలబ్రిటీ అయినా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కువకాలం డ్రామాలతో నెట్టుకురాలేరు. ఇది మూడుగంటల సినిమా కాదని రాజకీయమని ఇంకా గ్రహించటంలేదు. అందుకనే వీలైనంతలో డ్రామాలతోనే రాజకీయాన్ని నెట్టుకురావాలని అనుకుంటున్నట్లున్నారు. తాజాగా ఇప్పటం గ్రామంలో ఇళ్ళు కోల్పోయిన వారికి నష్టపరిహారం పేరుతో మరో డ్రామాకు తెరలేపారు. కూల్చని ఇళ్ళను కూల్చేశారని, ప్రహరీగోడలు కూల్చేస్తే ఏకంగా ఇళ్ళనే కూల్చేశారని, రోడ్లను ఆక్రమించి కట్టుకున్న ప్రహరిగోడలను ప్రభుత్వం కూల్చేస్తే దాన్నికూడా కక్షసాధింపని చెప్పటం పవన్ కే చెల్లింది.

ఇంతకీ విషయం ఏమిటంటే ఇప్పటం గ్రామంలో కొందరు రోడ్డును ఆక్రమించుకుని ప్రహరీగోడలను కట్టేసుకున్నారు. దాన్ని ప్రభుత్వం నోటీసులిచ్చి మరీ తొలగించింది. దాన్నే పవన్ కక్షసాధింపని గోలచేస్తున్నారు. ప్రభుత్వం ఎందుకు కక్షసాధిస్తోందంటే మొన్నటి మార్చిలో జనసేన ఆదిర్భావ సభకు స్ధలమిచ్చినందుకు కొందరిపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందంటు రచ్చ చేస్తున్నారు. అయితే పవన్ డ్రామాలు ఎక్కడ బయపడిందంటే తాజాగా తాను చెక్కులు పంపిణీ చేసిన వారిలో ఒక్కరు కూడా జనసేన సభకు స్ధలమివ్వలేదు.

పైగా అప్పట్లో 6.7 ఎకరాల స్ధలమిచ్చిన ఎనిమిదిమంది రైతులకు పవన్ అసలు చెక్కులనే ఇవ్వలేదు. అంటే బహిరంగసభకు స్ధలమిచ్చింది కొందరైతే ఇపుడు చెక్కులందుకున్నది వేరేవాళ్ళు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే బహిరంగసభకు స్ధలం ఇచ్చిన వాళ్ళ ఇళ్ళ ప్రహరీగోడదలను ప్రభుత్వం కొట్టలేదు. ఎందుకంటే వీళ్ళల్లో ఎవరు రోడ్డును ఆక్రమించుకుని ప్రహరీగోడలను కట్టుకోలేదు. కాబట్టి రోడ్డు వైడనింగ్ తో  వీళ్ళకి అసలు సంబంధమే లేదు.

ఇక్కడే పవన్ ఆడిన డ్రామాలన్నీ బయటపడిపోయాయి. ఆమధ్య వైజాగ్ ఎయిర్ పోర్టులో కూడా ఇలాగే చేశారు. మంత్రుల కార్లపైన జనసేన నేతలు, కార్యకర్తలు దాడులు చేస్తే అప్పుడు కూడా ఉల్టాగా చెప్పుకున్నారు. ర్యాలీలో తనతో పాటు పాల్గొన్నందుకు తమ నేతలపై కేసులుపెట్టి అరెస్టులు చేసిందని గోలచేశారు. అంటే క్షేత్రస్ధాయిలో ఒకటి జరుగుతుంటే చెప్పుకునేది, గోలచేసేది, ప్రచారం చేసుకునేది మాత్రం మరోటిగా ఉంది. ఎంతకాలం ఇలా డ్రామాలతో నెట్టుకొస్తారో ఏమో.


మరింత సమాచారం తెలుసుకోండి: