ఇటీవల కాలంలో టెక్నాలజీ ఎంతగానో పెరిగిపోయింది . ఈ క్రమంలోనే కావలసిన అన్ని విషయాలను కూడా అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లోనే తెలుసుకోగలుగుతున్నారు. అయితే ఒకప్పుడు ఎక్కడికైనా కొత్త ప్రదేశాలకు వెళ్లాలంటే రోడ్డు పక్కన ఉన్న వారిని దారి అడుగుతూ ఇక ముందుకు సాగే వారు. కానీ ఇప్పుడు మాత్రం అంత శ్రమ పడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే గూగుల్ మ్యాప్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇక ఎక్కడికి వెళ్లాలన్న మ్యాప్ లో చూసుకుంటూ ముందుకు సాగడం చేస్తూ ఉన్నారు అందరూ.


 ఇక ఇలా గూగుల్ మ్యాప్స్ లో మారుమూలన ఉన్న గ్రామాలకు సైతం రూట్ మ్యాప్ లో ఉండడంతో అందరికీ ఇబ్బందులు తప్పాయి అని చెప్పాలి. కానీ ఏకంగా గూగుల్ మ్యాప్ లో కూడా లేని ఒక ప్రాంతం ఉంది అది కూడా ఎక్కడో కాదు మన విజయవాడలోనే ఉంది అన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు. ఇంతకీ ఆ ప్రాంతం పేరు ఏంటో తెలుసా.. పాకిస్తాన్ కాలనీ. విచిత్రంగా ఉన్న.. ఇది నిజంగానే విజయవాడలో ఉంది. పేరుకు పాకిస్తాన్ కాలనీ అయినా అక్కడ మాత్రం అందరూ భారతీయులే ఉంటారు. అయితే ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఇక పాకిస్తాన్ భారత్ మిత్ర దేశాలు అన్నదానికి సూచికగా ఈ ప్రాంతానికి పాకిస్తాన్ కాలనీ అని పేరు పెట్టారట.


 అంతేకాదు ఇక పాకిస్తాన్ నుంచి వచ్చే వస్త్ర వ్యాపారులు బిజినెస్ చేసుకోవడం కోసం ప్రత్యేకంగా ఒక ప్రాంతాన్ని ఏర్పాటుచేసి పాకిస్తాన్ కాలనీ అనే పేరు పెట్టారు అన్న ప్రచారం కూడా కూడా ఉంది. ఇక ఎక్కువమంది పాకిస్తానీలు ఇక ఇండియాకు వచ్చి ఇక్కడే బట్టల దుకాణాలు పెట్టుకునే వారట. అయితే దీని గురించి గూగుల్ లో ఎంత సెర్చ్ చేసిన మాత్రం వివరాలు మాత్రం అసలు దొరకవు. కానీ అక్కడ ఉన్న జనం ఆధార్ కార్డులు రేషన్ కార్డుల్లో మాత్రం పాకిస్తాన్ కాలనీ అనే ప్రాంతం గురించిన పేరు మాత్రం రాసి ఉంటుంది. ఇలా గూగుల్ కే తెలియని ప్రాంతం గురించి తెలుసుకొని అందరూ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: