రిపబ్లిక్ డే నాడు ప్రతి సంవత్సరం కూడా దేశ రాజధాని ఢిల్లీలో వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈరోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోపాటు, ఈజిప్ట్ అధ్యక్షుడు, ఇతర అతిథులు, కేంద్ర మంత్రులు ఇంకా ప్రజా ప్రతినిధులు, వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.అందుకే ఢిల్లీలో భారీ భద్రత ఏర్పాటు చేశారు.అసలు కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏకంగా 6,000 మంది పోలీసులు, వివిధ దళాలకు చెందిన భద్రతా సిబ్బంది విధులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరినీ చాలా క్షుణ్ణంగా చెక్ చేశారు. ఇక క్యూఆర్ కోడ్ ఆధారంగానే ఈ వేడుకల్లో పాల్గొనేందుకు అనుమతిని ఇచ్చారు. ఇది కూడా ఈ ఏడాది నుంచే ఈ క్యూఆర్ బేస్డ్ ఎంట్రీని ప్రవేశపెట్టారు. గణతంత్ర వేడుకలు జరిగే ప్రాంగణం మొత్తం కూడా 150కిపైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందులో కొన్ని ఫేసియల్ రికగ్నిషన్ ఫీచర్ ఉన్నా అడ్వాన్స్‌డ్ కెమెరాలను కూడా ఫిక్స్ చేశారు. ఇంకా అలాగే వీటితోపాటు ప్రత్యేక యాంటీ డ్రోన్ టీమ్ కూడా పని చేసింది.


ఈ రోజు ఢిల్లీ మొత్తం కూడా పటిష్టమైన భద్రత ఉంది.అందుకే నగరంలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని చెక్ చేశారు. మార్కెట్లు ఇంకా అలాగే ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే ఇతర ప్రదేశాల్లో యాంటీ-సాబొగేట్ చెకింగ్ లు జరిపారు. అంటే ఇందులో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్స్ వంటివి పాల్గొన్నాయి. గత రెండు, మూడు నెలల ముందు నుంచే భద్రతా ఏర్పాట్లను చేశారు. నగరంలోని హోటళ్లు, ధర్మశాలలు, గెస్ట్ హౌజ్‌లు, సినిమా హాల్స్, పార్కింగ్ లాట్స్, బస్ టెర్మినల్స్ ఇంకా అలాగే రైల్వే స్టేషన్స్ వంటి అన్ని చోట్లా చెకింగ్ లు చేశారు. అలాగే సిబ్బందిని, అతిథుల్ని కూడా పరిశీలించారు. పారామిలిటరీ దళాలు కూడా రంగంలోకి దిగి, భద్రతా ప్రొటోకాల్ పర్యవేక్షించాయి. నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించడం జరిగింది.


రాజధాని మొత్తం పోలీసుల పర్యవేక్షణలో ఉండిపోయింది. ఇక అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు కనిపించినా, ఏదైనా కదలికను గుర్తించినా వెంటనే ప్రజలు పోలీసులకు సమాచారం అందించేలా ఆదేశాలిచ్చారు. గాలిలో ఎగిరే వాటిపై కూడా నిషేధం విధించారు. అంటే డ్రోన్లతోపాటు పారా గ్లైడర్స్, పారా మోటార్స్, హ్యాంగ్ గ్లైడర్స్, మైక్రోలైట్ ఎయిర్ క్రాఫ్ట్, హాట్ ఎయిర్ బెలూన్స్ ఇంకా అలాగే చిన్న విమానాలు వంటివాటిని కూడా నిషేదించారు. తీవ్రవాద కార్యకలాపాల్ని నియంత్రించే చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఇలా ఎన్నో జాగ్రత్తల మధ్య ప్రతి సంవత్సరం ఢిల్లీలో స్వాతంత్ర, గణతంత్ర వేడుకల్ని నిర్వహిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: