బెంగుళూరులోని హృదయాలయా ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్న నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్ధితిపై అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇందుకు కారణం  వైద్యులు, కుటుంబసభ్యులు మాత్రమే. లోకేష్ పాదయాత్ర పార్టిసిపేట్ చేసిన తారకరత్న 27 మధ్యాహ్నం రోడ్డుపైనే స్పృహతప్పి పడిపోయారు. అప్పటినుండి ఇప్పటికి ఐదురోజులుగా పరిస్ధితి అత్యంత సీరియస్ గా ఉందనే చెప్పాలి. కుప్పంలో ఉన్నంత డైరెక్టుగా తారకరత్నను చూడటంతో పాటు అక్కడి వైద్యులు చెప్పిన విషయాలను మీడియా రిపోర్టు చేసింది.

ఎప్పుడైతే తారకరత్నను బెంగుళూరు ఆసుపత్రిలో చేరారో అప్పటి నుండి వైద్యులు చెబుతున్నదాన్ని, కుటుంబసభ్యులు చెబుతున్నది మాత్రమే రిపోర్టు చేస్తున్నారు. వాస్తవం ఇలాగుంటే ఇపుడు కుటుంబసభ్యులు మీడియా తప్పుడు రిపోర్టు ఇస్తోందని నిందిస్తున్నారు. అలాగే డాక్టర్లు కూడా రెండురకాలుగా చెబుతుండటంతో గందరగోళం పెరిగిపోతోంది. ఇపుడు విషయం ఏమిటంటే ఐదురోజులుగా తారకరత్న స్పృహలో లేని మాట వాస్తవం. కార్డియాక్ అరెస్టుతో ఆసుప్రతిలో చేరిన తారకరత్నను పరీక్షించిన డాక్టర్లు ఎక్మో పద్దతిలో వైద్యం చేస్తున్నట్లు ప్రకటించారు.

ఎక్మో అంటేనే మెషీన్ ద్వారా కృత్రిమంగా గుండె, ఊపిరితిత్తులను పనిచేయించటం. సహజంగా గుండె, ఊపితిత్తులు పనిచేయనపుడు మాత్రమే ఎక్మో ఏర్పాటుచేస్తారు. ఈ విషయాన్ని స్వయంగా డాక్టర్లు, కుటుంబసభ్యులే చెప్పారు. ఇపుడేమో తారకత్నకు ఎక్మో పద్దతిలో వైద్యం చేస్తున్నట్లు మీడియా తప్పుడు రిపోర్టు చేస్తోందని తండ్రి రామకృష్ణ నిందించటమే ఆశ్చర్యంగా ఉంది.

ఐసీయూలో ఉన్న తారకత్నకు ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతోందో డాక్టర్లు లేదా కుటుంబసభ్యులు చెబితేనే మీడియాకు తెలుస్తుంది. వాళ్ళు ఏమిచెబితే దాన్ని మీడియా రిపోర్టు చేస్తోంది. అలాగే తారకరత్న సహజంగానే శ్వాస తీసుకుంటున్న కారణంగా వెంటిలెటర్ను తొలగించారని రామకృష్ణ చెప్పారు. ఆరోగ్య పరిస్ధితి కుదుటపడుతోందని కూడా స్వయంగా రామకృష్ణే చెప్పారు. దాంతో అందరు ఎంతో సంతోషించారు. అయితే కాసేపటి తర్వాత డాక్టర్లు రిలీజ్ చేసిన హెల్త్ బులిటెన్లో తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందన్నారు.


అలాగే వెంటిలేటర్ మీదనే శ్వాస తీసుకుంటున్నట్లు చెప్పారు. డాక్టర్ల ప్రకటనకు, రామకృష్ణ ప్రకటనకు ఎంత తేడా ఉందో చూడాలి. అలాగే తారకరత్నకు ఎక్మో వాడటంలేదని డాక్టర్లు చెప్పారు. మరి ఆసుపత్రిలో చేరిన మరుసటి రోజున ఎక్మో ట్రీట్మెంట్ మొదలుపెట్టినట్లు చెప్పింది డాక్టర్లే.  డాక్టర్లు చెప్పకపోతే లోపల ఏమి ట్రీట్మెంట్ ఇస్తున్నారో మీడియాకు ఎలా తెలుస్తుంది. ఇలాంటి పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారు కాబట్టే తారకరత్న పరిస్ధితిపై అసలేం జరుగుతోందో తెలీకే గందరగోళం పెరిగిపోతోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: