ఇపుడీ విషయంపై పార్టీలో అనుమానాలు మొదలయ్యాయి. ఇంతకీ విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో యువతకు 40 శాతం టికెట్లు కేటాయిస్తామని చంద్రబాబు చాలా సందర్భాల్లోనే చెప్పారు. మామూలుగా అయితే చంద్రబాబుకు ఉన్న పేరు ఏమిటంటే మాట మీద నిలబడరని. అయితే 40 శాతం హామీని చాలాసార్లు చెప్పటంతో ఏమోలే ఈసారికి మాట మీద నిలబడతారేమో అని అనుకున్నారు. అయితే తాజా పరిణామాలు చూస్తున్న తమ్ముళ్ళకి అనుమానాలు పెరిగిపోతున్నాయి.

ఇక్కడ గమనించాల్సిందేమంటే  వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చేస్తామని 40 మంది ఎంఎల్ఏలు పదేపదే ఫోన్లు చేస్తున్నారంటు అచ్చెన్నాయుడు చెబుతున్నారు. వీళ్ళు వైసీపీపై మైండ్ గేమ్ మొదలుపెట్టారులే అని అనుకున్నారు. అయితే ఒకే విషయాన్ని పదేపదే చెబుతున్నారు. దీనికి తోడు ఎల్లోమీడియాలో కూడా సుమారు 30 మంది వైసీపీ ఎంఎల్ఏలు టీడీపీలోకి వచ్చేయటానికి రెడీగా ఉన్నారంటు కథనం వచ్చింది.


వీళ్ళకి చంద్రబాబునాయుడు టికెట్ హామీ ఇస్తే చాలట వెంటనే టీడీపీలోకి దూకేయటానికి రెడీగా ఉన్నారన్నది కథనం సారంశం. అచ్చెన్న చెప్పింది, ఎల్లోమీడియా చెబుతున్నదే నిజమని అనుకుందాం. గోడదూకటానికి రెడీగా ఉన్న 30 మంది ఎంఎల్ఏల్లో కనీసం 25 మందికన్నా టికెట్లు అయితే ఇవ్వాల్సిందే కదా. అలాగే జనసేనతో పొత్తు దాదాపు ఖాయమైనట్లే. జనసేనకు కూడా ఓ 30 టికెట్లు ఇవ్వకతప్పదు కదా. అంటే వైసీపీ నుండే వచ్చే 30 మందికి, జనసేనకు 30 టికెట్లు అంటే 60 టికెట్లు వదులుకోవాల్సిందే. అడ్వాన్స్ బుకింగ్ లో 60 టికెట్లు పోతే ఇక మిగిలేది 115 టికెట్లు మాత్రమే. మళ్ళీ పొత్తుల్లో వామపక్షాలకు కనీసం ఐదు టికెట్లు కేటాయించాలి.


చివరగా టీడీపీకి మిగిలేది 110 నియోజకవర్గాలు మాత్రమే. ఇందులో సిట్టింగులు 19 మందిని తీసేస్తే మిగిలేది 91 సీట్లు. ఇప్పటికే చంద్రబాబు ఓ 20 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించేశారు.  అంటే మిగిలిన 71 సీట్లలో యువతకు 40 శాతం టికెట్లు కేటాయిస్తారా ? ఇది జరిగేపనికాదు. ఎందుకంటే చాలామంది సీనియర్లు పోటీకి రెడీ అయిపోతున్నారు. సో,  ఇవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు హామీ మీద అనుమానాలు పెరిగిపోతున్నాయి. 
మరింత సమాచారం తెలుసుకోండి: