చట్టం ముందు అందరూ సమానులే అని విషయాన్ని మరిచిపోయి చాలా మంది చంద్రబాబు అరెస్టు విషయంలో ఏసీబీ కోర్టు జడ్జి పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల సరైనది కాకపోయినా ఇప్పుడు న్యాయవ్యవస్థనే ప్రశ్నించడంతో పాటు తప్పు చేసినట్లుగా జడ్జిపై నిందలు వేస్తున్నారు. కొంతమంది ఆమె వైసీపీ తరఫు ఉన్న మనిషని అంటుంటే మరికొందరు మోపిదేవి వెంకట రమణ మేనకోడలని ప్రచారం చేస్తున్నారు.


అసలు ఏదీ వాస్తవం, ఏదీ అవాస్తవం తెలుసుకోకుండాా చంద్రబాబు అరెస్టు కాగానే ఇలా ఇష్టారీతిన న్యాయమూర్తులపైనే కామెంట్లు పెడుతున్నారు. గతంలో ఎవరూ అరెస్టయిన కూడా ఇంతలా న్యాయవ్యవస్థపై గానీ జడ్జిలపై గానీ ట్రోల్స్ రాలేవు. కానీ ప్రస్తుతం స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తీర్పు ఇచ్చిన జడ్జిపై కొంతమంది కావాలనే టార్గెట్ చేసి విమర్శలు చేయిస్తున్నారు. విపరీతంగా ట్రోల్స్ చేయిస్తూ రాక్షసానందం పొందుతున్నారు.


వాస్తవంగా ఆమె పేరు బొక్క వెంకట సత్య హిమబిందు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం బొక్కవారి పాలెం గ్రామానికి చెందిన శెట్టి బలిజ కులానికి చెందిన ఆమె. తండ్రి చంద్రశేఖర్ లాయర్ గా పనిచేశారు. నోటరీ పనుల్లో బిజీగా ఉండేవారు. ఈ కుటుంబం రాజకీయాలకు చాలా దూరంగా ఉంటుంది. ఆ ఊర్లో చాలా గౌరవంగా మన్ననలు పొందేవారు. ఆంధ్ర యూనివర్సీటీ నుంచి లా పట్టా పొందారు. 1996 లో హై కోర్టు బార్ కౌన్సిల్ లో రిజిష్టేషన్ చేయించుకున్నారు.


ఆ తర్వాత జడ్జి ఎంట్రన్స్ టెస్టు పాసై 2016 లో అమలాపురం అడిషనల్ డిస్ట్రిక్ సెషన్స్ కోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం వైజాగ్ లోని సీబీఐ ప్రిన్సిపాల్ స్పెషల్ జడ్జిగా పని చేశారు. 18-4-2023లో ఆమెను ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తులు విజయవాడకు ట్రాన్స్ పర్ చేసి మూడు పదవులు అప్పగించారు. ఏసీబీ, సీబీఐ, డిస్ట్రిక్ అడిషనల్ జడ్జిగా నియమించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: