నరేంద్రమోడీ స్వయంగా ఇచ్చిన బీసీ ముఖ్యమంత్రి హామీ లేదా స్లోగన్ బీజేపీకి అంతగా వర్కవుటైనట్లు అనిపించటంలేదు. తాజాగా ముగిసిన ఎన్నికల్లో అధికారంలోకి ఎవరొస్తారనే విషయంలో కొందరు బీఆర్ఎస్ అని మరికొందరు కాంగ్రెస్ పార్టీ అని చెబుతున్నారు. అయితే ఎవరు కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని పొరబాటున కూడా చెప్పటంలేదు. దీనికి బలమైన కారణాలు రెండు మూడున్నాయి. అవేమిటంటే మీడియా, పలు సంస్ధలు నిర్వహించిన అనేక సర్వేల్లో బీజేపీ పరిస్ధితి ఆశాజనకంగా కనిపించకపోవటమే.





సర్వే చూసినా బీజేపీకి మహాయితే సింగిల్ డిజిట్ అని మాత్రమే జోస్యాలు చెప్పాయి. అందులోను చాలా సంస్ధలు 4 లేదా 5 చోట్ల గెలిస్తే చాలా ఎక్కువని బల్లగుద్ది మరీ చెప్పాయి. దాంతో బీజేపీ మీద చాలామందిలో నమ్మకం పోయింది. అలాగే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నబండి సంజయ్ ను సడెన్ గా మార్చేయటం కూడా పార్టీ మీద బాగా నెగిటివ్ ప్రభావం చూపిందని అంటున్నారు. ఇదే విషయం పార్టీ నేతల మధ్యలో కూడా చర్చలు జరిగాయని సమాచారం.





ఇవికాకుండా పెరిగిపోతున్న నిత్యావసర వస్తువులు, తెలంగాణా అభివృద్ధికి ప్రత్యేకంగా కేంద్రం సాయం చేయలేదనే భావన, సంస్ధాగతంగా పార్టీని బలోపేటం చేసుకోలేకపోవటం, కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తెలంగాణా కాంగ్రెస్ నేతల్లో జోష్ పెంచేయటం లాంటి అనేక కారణాలతో బీజేపీ గ్రాఫ్ బాగా డౌన్ అయిపోయింది. ఈ పరిస్ధితుల్లోనే నరేంద్రమోడీ బీజేపీ గెలిస్తే బీసీ నేతనే ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించారు.




బీసీ నేత బండిని అధ్యక్షుడిగా తీసేసి బీసీ నేతను ముఖ్యమంత్రిగా చేస్తామని స్వయంగా మోడీనే హామీ ఇచ్చినా పెద్దగా వర్కవుటైనట్లు లేదు. మోడీ ఇచ్చిన బీసీ ముఖ్యమంత్రి హామీని జనాలు పెద్దగా నమ్మలేదు. ఆ విషయం అర్ధమవ్వటంతోనే ఎస్సీ వర్గీకరణకు కూడా హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణ ప్రకటనతో మాదిగలు, బీసీ ముఖ్యమంత్రి హామీతో బీసీలు పోలోమంటు బీజేపీకి ఓట్లేసేస్తారని కమలనాదులు అనుకున్నట్లున్నారు. మోడీతోనే స్వయంగా ప్రకటనలు, హామీ ఇప్పిస్తే నమ్ముతారని అనుకున్నా జనాలు మరోవిధంగా ఆలోచించినట్లున్నారు. అందుకనే బీజేపీ గురించి ఎవరూ పెద్దగా మాట్లాడటంలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: