కాపు సంక్షేమ సేవ వ్యవస్థాపకులలో ఒకరైన హరి రామ జోగయ్య గారు ప్రతి ఒక్కరికి సుపరిచితమే... ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో గత కొద్ది నెలల నుంచి వరుస పెట్టి లేఖలు రాస్తూ మరింత పాపులారిటీ అందుకున్నారు.. జనసేన పార్టీకి సూచనలుగా ఇస్తూ ఉండేవారు.. ఈ క్రమంలోనే తాజాగా శుక్రవారం రోజున కాపు సంక్షేమ సేనను రద్దు చేస్తున్నట్టుగా కూడా ఒక లేఖ ద్వారా విడుదల చేశారు.. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆ రోజే కాపు సేన ను రిజిస్ట్రేషన్ చేయించామని తెలిపారు..


పవన్ కళ్యాణ్ తో సహా చాలామంది వ్యక్తులు జనసైనికులు తనని అపార్థం చేసుకుంటున్నారు అంటూ ఈ లేఖలు వెల్లడించారు.. అందుకే ఎన్నికలు అయ్యేవరకు కాపు సంక్షేమ శాఖను రద్దు చేయబోతున్నట్లుగా వెల్లడించారు.. ఇటీవల నేతలు విమర్శలతో హరి రామ జోగయ్య చాలా విసిగిపోయారని విరక్తి కూడా చెందారని తెలుస్తోంది. ఇలాంటి సమయంలోనే కాపు సేన నుంచి తాత్కాలికంగా తాను తప్పుకుంటున్నట్లుగా ఈ లేఖలో తెలియజేయడం జరిగింది.. వీటితోపాటు కాపు సంక్షేమ శాఖ అనుబంధ కమిటీలను హోదాలను కూడా రద్దు చేస్తున్నట్లుగా వెల్లడించారు..


ఎన్నికల తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి ఏదైనా కొత్త కమిటీ వేస్తాము అన్నట్లుగా వెల్లడించారు అప్పటివరకు తాను రాజకీయ విశ్లేషకుడిగా ఉంటానంటూ తెలియజేశారు ఇదే లేఖలు యాచించే స్థాయి నుండి శాసించే స్థాయికి కాపులు ఎదగాలని కోరుకుంటున్నట్లుగా కూడా వెల్లడిస్తూ ఇదే అంశంతోనే అప్పట్లో ప్రజారాజ్యం పార్టీలో కూడా చేరాలని కానీ చిరంజీవి ఆ పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేయడంతో చాలా నష్టపోయామంటూ తెలియజేశారు మళ్లీ ఇప్పుడు అలాంటి నష్టం జరగకూడదని భావిస్తున్నట్లుగా కూడా హరి రామ జోగయ్య ఈ లేఖలు వెల్లడించారు..


ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ టిడిపి బిజెపి పార్టీతో పొత్తు పెట్టుకుని మరి ఈసారి ఎన్నికలలో పోటీ చేయడంతోపాటు కేవలం 24 సీట్లను తీసుకోవడంతో అటు జనసైనికులు కాపు నేతలు సైతం పవన్ కళ్యాణ్ పైన ఫైర్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: