* ధర్మవరంలో గెలిచేది ఎవరు

* నాలుగున్నర ఏళ్లుగా నియోజకవర్గం అంతటా తిరుగుతున్న కేతిరెడ్డి

* అయినా ఓడిపోయే అవకాశాలు ఉంటాయా

(ఆంధ్రప్రదేశ్-ఇండియా హెరాల్డ్)

ధర్మవరం నియోజకవర్గంలో వైసీపీ పార్టీ తరఫున  కేతిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. 2019లో వైసీపీ నుంచి కాంటెస్ట్ చేసిన కేతిరెడ్డి ఇక్కడ ఘనవిజయం సాధించారు. గెలిచిన సమయం నుంచి నియోజకవర్గం అంతటా తిరుగుతూ ప్రజలకు ఎన్నో సేవలు చేస్తూ వస్తున్నారు. ప్రతి ఇంటింటికి తిరిగి పెన్షన్ వచ్చిందా, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడుగుతున్నారు. ఆ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తూ తన గొప్ప మనసును చాటుకుంటున్నారు.

ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలో ఆయన్ని చూసి నేర్చుకోవచ్చు అని రాజకీయ విశ్లేషకులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాబట్టి ఈసారి ధర్మవరంలో కేతిరెడ్డి తప్పనిసరిగా గెలిచే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు ధర్మవరం నుంచి 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ తరఫున అభ్యర్థిగా వై.సత్యకుమార్ ను ప్రకటించారు.

ప్రధాని నరేంద్ర మోదీకి సమీప బంధువుగా, బీజేపీ జాతీయ సెక్రటరీగా పేరుగాంచిన సత్యకుమార్ కు ధర్మవరం నుంచి బీజేపీ టికెట్ లభించింది. సత్యకుమార్ గత 34 సంవత్సరాలుగా బీజేపీలో యాక్టివ్ మెంబర్ గా ఉన్నారు. టీడీపీ, జనసేన కలిసి బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. మోదీ, అమిత్ షాలకు సన్నిహితుడిగా జాతీయ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాలలో ఎన్నికల పరిశీలకుడిగా పనిచేసి, బీజేపీ విజయాలకు తోడ్పడ్డారు. మరి ధర్మవరంలో గట్టి పోటీ ఇచ్చే కేతిరెడ్డి పై ఆయన గెలుస్తారా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ కేతిరెడ్డికే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

ఇతర పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థుల కారణంగా వీరి ఓట్లు చీలే అవకాశం ఉంది. జగన్ ఓన్లీ గెలుస్తారు అని అనుకునే అభ్యర్థులనే నిలబెట్టారు. గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నా నాయకులలో కేతిరెడ్డి ముందు వరుసలో నిలిచారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: