దేశమంతట జమిలీ ఎన్నికల గురించి గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. బిజెపి ఎప్పుడు దేశంలో ఒకేసారి ఎన్నికలు పెడుతుందా అని చాలా రాష్ట్రాలు ఎదురుచూస్తున్నాయి. కానీ ప్రాంతీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ సహా చాలా పార్టీలు కొంతమేరకు భయపడిపోతున్నాయనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో తమ పదవీకాలం సైతం ప్రమాదంలో పడుతుందని ఇబ్బందులు కూడా పడుతున్నాయి.. మరి కొన్ని పార్టీలు జమిలీ ఎన్నికలు వస్తే మేలు అన్నట్లుగా తెలియజేస్తున్నాయి. గత కొద్దిరోజులుగా జమిలీ ఎన్నికల పైన రోజుకొక వార్త వినిపిస్తూ ఉండడంతో తాజాగా కేంద్ర ప్రభుత్వమే క్లారిటీ ఇచ్చింది.


ఓకే దేశం ఓకే ఎన్నిక అనే భావన పైన వస్తున్న రూమర్స్ పైన రాబోయే ఎన్నికలలో ఇది అమలు చేయడం సాధ్యం కాదంటూ తెలిపారు ఆర్థిక వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్.. ఒక సభలో  మాట్లాడుతూ 2024 లోక్సభ ఎన్నికలలో సుమారుగా లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయని ఒకేసారి ఎన్నికల నిర్వహించడం వల్ల వీటన్నిటిని ఆదా చేయవచ్చు అంటూ వెల్లడించారు.. ఒకేసారి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే GDP దాదాపుగా 1.5 శాతం వరకు వృద్ధి చెందుతుందంటూ తెలియజేశారు. కొన్ని పార్టీలు ఒకే దేశం ఒకే ఎన్నిక పైన కొన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని వాటిని ఎవరు నమ్మకండి అంటూ తెలిపింది.


2034 తరువాత ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందంటూ తెలిపింది నిర్మల సీతారామన్.. అప్పటి రాష్ట్రపతి ఆమోదం కోసమే ఇప్పుడు పునాదులు వేస్తున్నామంటూ తెలియ చేశారు. అయితే ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది 1960 నుంచి ఇది ఉనికిలో ఉన్నదని దీన్ని ప్రయోజనాన్ని పరిగణంలోకి తీసుకుని మద్దతు ఇస్తే ఒకే దేశం ఒకే ఎన్నికల మారుతుందని కేంద్రమంత్రి తెలిపారు. దివంగత డీఎంకే నేత ఎం.కరుణానిధి ఇందుకు మద్దతు ఇచ్చారని కానీ ఇప్పుడు ఆయన కుమారుడు ఎం.కె స్టాలిన్ మాత్రం తన తండ్రి అడుగుజాడలలో నడవలేదని  వెల్లడించారు సీతారామన్. దీన్ని బట్టి చూస్తే ఇప్పట్లో జెమిలీ ఎన్నికలు సాధ్యం కావాలంటూ తెలియజేసినట్టు కనిపిస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: