
ప్రధాన నరేంద్ర మోడీ తన ట్విట్టర్ వేదికగా సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నా స్నేహితుడు చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు భవిష్యత్తు తరాల పై దృష్టి సాధించి ఆయన పని చేస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవిశ్రాంతిగా పని చేస్తున్న చంద్రబాబు పనితీరు అందరికీ ప్రశంసనీయం అంటూ చంద్రబాబు దీర్ఘాయుష్తో ఆరోగ్యవంతమైన జీవితం ప్రసాదించాలంటు ఆ దేవున్ని కోరుకుంటున్నారని మోడీ శుభాకాంక్షలు తెలిపారు.
వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ దీర్ఘాయుష్షుతో జీవించాలని కోరుకుంటున్నానని ట్విట్టర్ వేదికగా తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి ఇలా తెలియజేస్తూ దూరదృష్టి కలిగిన నాయకుడు దొరకడం తెలుగు ప్రజల అదృష్టమంటూ తెలియజేస్తూ చంద్రబాబు గారి సేవలు గురించి తెలిపారు..ఆయన ధార్మిని కథ కృషి పట్టుదల అంకితభావం కలిగిన గొప్ప నాయకులు అంటూ మీకు ఆయురారోగ్యాలతో పాటు మీరు కనే కలలు నెరవేర్చే దిశగా అడుగులు వేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను అంటూ చిరంజీవి సీఎం చంద్రబాబు నాయుడుకు 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మీలాంటి నిబద్ధత కలిగిన నాయకుడు లభించడం తెలుగు ప్రజల అదృష్టమని చిరంజీవి తెలియజేశారు.
అలాగే గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కూడా తెలియజేశారు.
ఇక వీరే కాకుండా చాలామంది సెలబ్రిటీలతోపాటు పలువు రాజకీయ నాయకులు కూడా సీఎం చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ పుట్టినరోజు తో సీఎం చంద్రబాబు తన 75వ పుట్టినరోజుని జరుపుకున్నారు.