నిన్నటి రోజున ప్రధాన మోడీ అమరావతి పర్యటనకు రావడం జరిగింది. రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభంతో పాటుగా పలు రకాల ప్రాజెక్టులకు సైతం మోడీ శంకుస్థాపన కూడా చేశారు. నిన్నటి రోజున మధ్యాహ్నం 2:50 నిమిషాలకు విజయవాడ విమానాశ్రయంకి చేరుకొని అక్కడ నుంచి హేలిప్యాడ్ ద్వారా అమరావతికి వచ్చారు. అలా సాయంత్రం 5: 20 నిమిషాల వరకు పలు రకాల కార్యక్రమాలలో పాల్గొన్నారు మోదీ. ఇందులో భాగంగా మోదీ పర్యటన 1: 15 నిమిషాలు మాత్రమే చేసినట్లు తెలియజేస్తున్నారు పలువురు నిపుణులు.


ఈ 75 నిమిషాల పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. ఇందుకోసం 40 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధాన మోడీ కోసం ప్రత్యేకంగా ఏ ఆకారంలో ఏర్పాటు చేసేలా పైలాన్ ను ఆవిష్కరించారు కేవలం ఇందులో 14 మంది మాత్రమే కూర్చోనే ఏర్పాటు చేశారు. ప్రధానం మోదీ సభకు 250 ఎకరాల విస్తీర్ణంలో ఐదు లక్షల మంది సభకు తరలించారు అలాగే 3500 బస్సులను కూడా ఏర్పాటు చేశారు. వీటికి తోడు చాలామంది స్పెషల్ వైద్యులతో పాటుగా 30 మంది బృందాలను వివిధ పాయింట్లు పెట్టారట. అలాగే ఆరు అంబులెన్స్లతో ఇతరత్రా సేవలను కూడా ఉంచారు.


నిన్నటి రోజున లక్ష కోట్లు విలువైన అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపన చేశారు. ప్రధాన మోడీ ఖర్చు ఎంత అయింది అనే విషయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇవన్నీ కూడా అంచనాలే. మోదీ పర్యటనలో భాగంగా విద్యుత్ విలువలు సుమారుగా రెండు కోట్ల రూపాయల వరకు ఖర్చయిందట.. అలాగే ట్రాఫిక్ నిర్వహణ పార్కింగ్ ఏర్పాట్లు ఇతరత్ర వాటీకి కోటి రూపాయలు ఖర్చు. అంతేకాకుండా 25 వేల ఎకరాల 36 కోట్ల రూపాయలతో కంపచెట్లను తొలగించారట.


అయితే ఇందులోని అధునాతన సదుపాయాలు కలిగిన బిల్డింగులతో పాటు విలాసవంతమైన రోడ్లు, అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ ,నీటి వసతి బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్ తో ఆహ్లాదకరమైన నగరాన్ని సైతం సృష్టించేల ప్రణాళికలను సిద్ధం చేశారట. అంతేకాకుండా ఇందులో తొమ్మిది కార్యక్రమాలకు పైగా 9 నగరాలను సృష్టించే విధంగా ప్లాన్ చేస్తున్న ఏపీ ప్రభుత్వం. ప్రధాన మోడీ కూడా 11 కీలకమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. రాజధాని లోని 75 వేల కోట్ల పనులకు శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే 49 వేల కోట్ల ఖర్చుతో పనులు చేయడానికి టెండర్లను ఇచ్చారట.

మరింత సమాచారం తెలుసుకోండి: