
అయితే మరీ ఒత్తిడి ఎక్కువైతే మాత్రం ఉద్యోగులు కానీ ఉద్యోగ సంఘాలు కానీ తిరుగుబాటు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఉద్యోగ సంఘాలు సైతం ప్రభుత్వంను ఎదురించడానికి ఆసక్తి చూపడం లేదని చెప్పవచ్చు. వైసీపీ పాలన సమయంలో ఉద్యోగ సంఘాలు కొంతమేర పోరాటం సాగించాయి. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో మాత్రం ఉద్యోగ సంఘాలు సర్దుకుపోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి.
ఇప్పుడు మాత్రం ఆ లెక్కలు మారుతున్నాయి. ఇప్పుడు ఉద్యోగులు తిరగబడుతుండటం సంచలనం అవుతోంది. పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర మీద మహిళా తహశీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఎమ్మెల్యే తనకు వాట్సాప్ కాల్ చేసి బూతులు తిట్టారంటూ మహిళా అధికారి ఆరోపణలు చేయడం గమనార్హం.
తీవ్రస్థాయిలో వేధింపులకు గురి చేయడం వల్లే సదరు అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారనే చర్చ జరుగుతోంది. వాట్సాప్ కాల్ బట్టి ఆధారాలు చూపించే విషయంలో కొంతమేర ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది. ఈ వివాదం విషయంలో కూటమి సర్కార్ ఎలా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు